మహావీరుడు షహీద్ భగత్ సింగ్ కారణజన్ముడు – జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan Paid Tribute to Shaheed Bhagat Singh on his Birth Anniversary, Janasena Chief Pawan Kalyan, Janasena Chief Pawan Kalyan Tribute to Shaheed Bhagat Singh, Shaheed Bhagat Singh, Shaheed Bhagat Singh Birth Anniversary, Mango News, Mango News Telugu, Pawan Kalyan Tribute to Shaheed Bhagat Singh, Janasena Chief Pawan Kalyan, Pawan Kalyan Latest News And Updates, Bhagat Singh , Chandigarh Airport Renamed Shaheed Bhagat Singh International Airport, Shaheed Bhagat Singh International Airport, Bhagat Singh Biography Death & Facts

షహీద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నీరాజనాలు ఆర్పించారు. మహావీరుడు షహీద్ భగత్ సింగ్ కారణజన్ముడు అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. “మరణించినా జీవించి ఉండేవారిని కారణజన్ములు అంటారు. అటువంటి కారణజన్ముడే ‘షహీద్ భగత్ సింగ్’. భరతమాతను దాస్య శృంఖలాల నుంచి విడిపించడానికి యుక్త వయస్సులోనే ప్రాణాలను తృణప్రాయంగా విడిచిపెట్టిన ఆ మహావీరుని జయంతి సందర్భంగా ఆ తేజోమూర్తికి నీరాజనాలు అర్పిస్తున్నాను. భగత్ సింగ్ మన మధ్య భౌతికంగా లేకపోచ్చు, కానీ ఆయన స్ఫూర్తి భారతీయుల గుండెల్లో పదిలంగా నిక్షిప్తమై వుంది” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

“పిన్న వయస్సులోనే ప్రపంచ ఉద్యమాల చరిత్రను ఔపోసన పట్టి విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని దేశానికి పరిచయం చేసిన విప్లవ వీరుడాయన. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పోరాడి 23 ఏళ్ల వయస్సులోనే ఉరి కంబాన్ని ముద్దాడిన ఈ దేశభక్తుని వీర మరణం వృథా కాలేదు. ఎందరో యువకులు పోరుబాట పట్టారు. జాతికి విముక్తి కలిగించారు. భగత్ సింగ్ ఆచరించిన సామ్యవాద స్పూర్తితో జనసేన ప్రస్థానం అజరామరంగా కొనసాగుతుందని ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తూ ఆ అమరజీవికి వందనాలు అర్పిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − twelve =