నేడే రాజ్యసభ ఎన్నికలు.. 4 రాష్ట్రాల్లో 16 స్థానాలకు, బలం పెంచుకోనున్న బీజేపీ!

Rajya Sabha Election 21 Candidates Contests For 16 Seats in 4 States Counting To Be Started 1 hr After Polling, Rajya Sabha Election 21 Candidates Contests For 16 Seats in 4 States, Rajya Sabha Election Counting To Be Started 1 hr After Polling, 21 Candidates Contests For 16 Seats in 4 States, 16 Seats in 4 States, 21 Candidates Contests For 16 Seats, 21 Candidates, 16 Seats, 4 States, Rajya Sabha Election, 16 Rajya Sabha seats across four states, Rajya Sabha seats, Rajya Sabha Election 2022, Rajya Sabha Election News, Rajya Sabha Election Latest News, Rajya Sabha Election Latest Updates, Rajya Sabha Election Live Updates, Mango News, Mango News Telugu,

రాజ్యసభ ఎన్నికలకు వేళ అయింది, నాలుగు రాష్ట్రాల్లోని మొత్తం 16 సీట్లకు నేడు జరగనున్న ఎన్నికల్లో 21 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మహారాష్ట్ర, రాజస్తాన్, హరియాణా, కర్ణాటక రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడినుంచి పలువురు ప్రముఖులు పోటీ చేస్తున్నారు. వారిలో.. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్‌ గోయెల్, కాంగ్రెస్‌ నేతలు రణ్‌దీప్‌ సూర్జేవాలా, జైరాం రమేశ్, ముకుల్‌ వాస్నిక్, శివసేన కీలక నేత సంజయ్‌ రౌత్‌ తదితరులున్నారు. జూలైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించున్నాయి.

ఈ ఎన్నికలలో గెలుపొందిన వారు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక పరిశీలకులను నియమించి, పోలింగ్‌ ప్రక్రియను ఆసాంతం వీడియో రికార్డు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా పోలింగ్ ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. అయితే ఈ ఎన్నికలలో కేంద్రంలోని బీజేపీకే అధిక సీట్లు దక్కే అవకాశాలున్నాయి. అయితే మొత్తం దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాలకు గాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, బిహార్, పంజాబ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల నుంచి 41 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవగా.. మిగిలిన 4 రాష్ట్రాల్లో ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి.

బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న మహారాష్ట్ర, రాజస్థాన్‌ రాష్ట్రాలలో 4 స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. మహారాష్ట్రలో అత్యధికంగా 6 సీట్లకు, కర్ణాటకలో 5, రాజస్థాన్‌లో 5, ఇక హర్యానాలో 2 సీట్లకు ఓటింగ్ జరగనుంది. దీంతో అన్ని ప్రధాన పార్టీలు తమ ఎ‍మ్మెల్యేలను రిసార్ట్‌లకు తరలించాయి. ఇక రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి బద్ద విరోధ పార్టీగా ముద్ర పడిన ఎంఐఎం.. శివసేన నేతృత్వంలోని కూటమికి మద్దతు పలికడం విశేషం. ఈ మేరకు మహారాష్ట్ర రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు. పోలింగ్ పూర్తయిన 1 గంట తర్వాత కౌంటింగ్ మొదలవనుంది. కాగా ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here