రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొనకుండా చేయడానికే టీకాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

TPCC Chief Revanth Reddy Criticizes ED Issues Notices To Prevent Participating T-Congress Leaders Rahul's Padayatra, ED Notices To T-Congress Leaders , Rahul Gandhi Padayatra, Tpcc Chief Revanth Reddy, Revanth Reddy Comments On ED Notices, Mango News, Mango News Telugu, ED Notices To Congress Leaders, Rahul Gandhi's Bharat Jodo Yatra, Rahul Gandhi Congress Bharat Jodo Yatra, Rahul Gandhi , Rajiv Gandhi, Priyanka Gandhi, Sonia Gandhi, Rahul Gandhi Latest News And Updates, Tpcc Chief Revanth Reddy News And Live Updates, Revanth Reddy

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న ‘భారత్ జోడో యాత్ర’లో ఇతర నాయకులెవరూ పాల్గొనకుండా చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, అందుకే కుట్రపూరితంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ ద్వారా నోటీసులు ఇప్పిస్తోందని ఆరోపించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ పాదయాత్రకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో రూట్‌ మ్యాప్‌ ఖరారైంది. రాహుల్ పాదయాత్ర హైదరాబాద్‌ నగరం నుంచి సాగేలా టీకాంగ్రెస్ నేతలు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు. 14 రోజుల పాటు సాగనున్న ఈ యాత్రలో మొత్తం 7 పార్లమెంట్ స్థానాలతో పాటు 17 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 375 కిలోమీటర్ల మేర రాహుల్‌ యాత్ర సాగనుంది.

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తున్న నేపథ్యంలో తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్రను అడ్డుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అందుకే సీనియర్ నేతలైన గీతారెడ్డి, షబ్బీర్‌ అలీ, అంజన్‌ కుమార్‌ తదితరులకు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ నోటీసులు ఇచ్చారని రేవంత్ విమర్శించారు. అయితే నోటీసులు అందుకున్నతెలంగాణ కాంగ్రెస్ నేతలను ఢిల్లీకి పిలిపించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం, విచారణను ఎదుర్కొనేందుకు కేసు పూర్వాపరాలపై వారికి అవగాహన కల్పించింది. కాగా విరాళాలు చెక్కుల రూపంలోనే ఇచ్చామని స్పష్టం చేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు విచారణకు హాజరవుతామని, అధికారులకి సహకరిస్తామని ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − fourteen =