తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత ఊపందుకుంది. రాష్ట్రంలో మొత్తం 80,039 ఉద్యోగాలను భర్తీలో భాగంగా గ్రూప్-1, పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇప్పటికే విడుదలై ప్రక్రియ కొనసాగుతుండగా, తాజాగా నిరుద్యోగ యువత ఎంతగానో ఎదురుచూస్తున్న గ్రూప్-4 నోటిఫికేషన్ కూడా విడుదల అయింది. గ్రూప్-4 కింద 9,168 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్-4 కు సంబంధించి 25 విభాగాలకు చెందిన 9,168 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇందులో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్, వార్డ్ ఆఫీసర్ సహా పలు రకాల పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల కోసం డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 12వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. అలాగే గ్రూప్-4 పరీక్షను (ఆబ్జెక్టివ్ టైప్) 2023, ఏప్రిల్/మే లలో నిర్వహించే అవకాశాలున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. అదేవిధంగా ఖాళీల విభజన, వయస్సు, వేతన స్కేల్, కమ్యూనిటీ, విద్యార్హతలు మరియు ఇతర సూచనలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్ డిసెంబర్ 23 నుండి కమిషన్ వెబ్సైట్ లో https://.tspsc.gov.in/ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE