శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘టైమ్ మేనేజ్ మెంట్’ అనే అంశం గురించి వివరించారు. ఒక్కో మనిషికి ఒక్కో రకమైన ప్రాధాన్యతలు ఉంటాయని, టైమ్ ప్రణాళికలో ముఖ్యంగా అవే అడ్డువస్తాయని చెప్పారు. టైమ్ మేనేజ్ మెంట్ లో ప్రాధాన్యతను ఎంచుకోవడం, నిశ్చయించుకున్న పనులను వరుస క్రమంలో చేయడం, క్రమశిక్షణ, పట్టుదలతో ఆ పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయడం వంటి అంశాలు కీలకమైనవని పేర్కొన్నారు. వీటన్నింటిలో ప్రాధాన్యతను ఎంచుకోవడమే అన్నిటికంటే కష్టమని తెలిపారు. ప్రభావంతంగా టైమ్ మేనేజ్ మెంట్ చేసుకోవడం ఎలాగో ఈ ఎపిసోడ్ లో యండమూరి వీరేంద్రనాథ్ గారు విశ్లేషించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]