షర్మిలకు అండగా ప్రచారానికి మంత్రి కొండా సురేఖ

Konda Surekha, Sharmila, Minister Konda Surekha campaigned, Minister Konda Surekha, AP, Konda Surekha campaigned for Sharmila, Cm Jagan,YS Rajasekhar Reddy, Konda Surekha Spurns Sharmila's Offer, CM Revanth, BRS Leaders, Konda Surekha Campaign, Warangal, Mango News Telugu, Mango News
AP, Konda Surekha campaigned for Sharmila,Minister Konda Surekha , Cm Jagan,YS Rajasekhar Reddy

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా రంగంలోకి దిగిన వైఎస్ షర్మిల ..ప్రజాక్షేత్రంలోకి దూకుడుగా వెళుతున్నారు. ఏపీలో   ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ నూతన జవసత్వాలు తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలు, నియోజకవర్గాల వారీగా షర్మిల పర్యటించి పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులలో జోష్‌ను పెంచుతున్నారు. అదే సమయంలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూల దృక్పధాన్ని పెంచడానికి దూకుడుగా ముందుకు సాగుతున్నారు..

దీంతోనే   తన అన్నయ్య, ఏపీ సీఎం అయిన జగన్ పైన, ఆయన పాలన మీద షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు ఏపీలో ఎవరూ షర్మిలలా ఈ రేంజ్‌లో ఇంత ఘాటు విమర్శలు చేయలేదని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఇలాంటి సమయంలోనే మరో న్యూస్ వినిపిస్తోంది. సొంత అన్నయ్యతో బలంగా ఢీ కొడుతున్న షర్మిలకు అండగా ఉంటానంటూ..మరొక ఫైర్ బ్రాండ్ తెలంగాణ నుంచి ఏపీ వెళ్లడానికి రెడీ అవుతున్నారు.

ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరఫున వైసీపీపై ఒంటరి పోరాటం చేస్తున్న షర్మిలకు అండగా.. తెలంగాణ మంత్రి కొండ సురేఖ తాను కూడా రెడీ అంటున్నారు. ఇప్పటికే వైఎస్ జగన్ పాలనపైన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న కొండ సురేఖ..తాను కూడా షర్మిలకు అండగా ఉంటానని, కాంగ్రెస్ పార్టీ తరపున ఏపీలో  ప్రచారం చేస్తానని చెబుతున్నారు. కాకపోతే తాను ఏపీకి వెళ్లడానికి అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నానని అంటున్నారు.

ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని, రాజకీయంగా ఆయన ఆశీర్వాదంతోనే ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నానని కొండా సురేఖ గుర్తు చేసుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి లక్షణాలు జగన్మోహన్ రెడ్డిలో ఏమాత్రం లేవని ఇప్పటికి చాలాసార్లు విమర్శలు గుప్పించిన కొండ సురేఖ..ఇప్పుడు అన్నతో తలపడుతున్న వైఎస్ షర్మిల కు ఏపీలో అండగా ఉంటానని చెబుతున్నారు.

వైసీపీ కోసం, జగన్ కోసం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్  వెంట నడిచిన నాయకులలో కొండా సురేఖ ఒకరు. అయితే జగన్ సమైక్యరాగం అందుకోవడం..ఆ తర్వాత ఆయనతో వచ్చిన విబేధాలవల్ల  తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకురాలుగా ఆమె వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. తర్వాత  జగన్ తీరుపై షర్మిల చాలా సందర్భాల్లో తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికే షర్మిల రాకతో ఏపీ రాజకీయాలలో వేడి రగులుకోగా.. కొండా సురేఖ కూడా వైఎస్ షర్మిల కోసం  ఏపీ రాజకీయాలలో దిగితే జగన్ వీళ్ల దాడిని తట్టుకోవడం కష్టమేనని  రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ