పొత్తు దిశగా కాంగ్రెస్-జై భారత్ పార్టీలు?

Congress, Jai Bharat National Party, YS sharmila, JD Lakshmi narayana, ap elections, Jai Bharat Samanta Party, JBNP, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, YS Jagan, AP News, Mango News Telugu, Mango News
Congress, Jai Bharat National Party, YS sharmila, JD Lakshmi narayana, ap elections

ఎన్నికలవేళ ఏపీలో ఎత్తులు, పొత్తులు, జంపింగ్ రాజకీయాలు కాక రేపుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీని ఢీ కొట్టేందుకు ప్రధానప్రతిపక్షమైన తెలుగుదేశం-జనసేన పార్టీలు పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నాయి. ఎలాగైనా వైసీపీని గద్దె దించేలా.. అధికారం చేజిక్కించుకునేలా టీడీపీ-జనసేన పార్టీలు పావులు కదుపుతున్నాయి. అటు భారతీయ జనతా పార్టీ కూడా టీడీపీ-జనసేన పొత్తుతో చేతులు కలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఏపీలో మరో కొత్త కూటమి పురుడుపోసుకోనుందా అంటే.. ప్రస్తుత పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి.

గత ఎన్నికలవేళ జనసేన పార్టీలో చేరారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ఆ తర్వాత హైకమాండ్‌తో పొసగకపోవడంతో పార్టీ నుంచి బయటికొచ్చేశారు. తిరిగి ఏపీలో మళ్లీ ఎన్నికలొచ్చే సరికి ఏపీలో ఏకంగా పార్టీనే స్థాపించారు. జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో రాజకీయ పార్టీని నెలకొల్పారు. వచ్చే ఎన్నికల్లో తమ హవా చాటేలా లక్ష్మీనారాయణ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే తమ పార్టీ మేనిఫెస్టోను కూడా ఆయన ప్రకటించారు. అంతేకాకుండా ఏపీలోని 175 నియోజకవర్గాల్లో తమ జై భారత్ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు.

అలాగే విభజన హామీలు, ఏపీకి ప్రత్యేక హోదా వంటి అంశాలతో పాటు విశాఖ స్టీల్  ప్లాంట్ ప్రైవేటీకరణపై పోరాడుతామని లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఇటీవల కాంగ్రెస్ ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశంపై పోరాటం చేసింది. ఆ పోరాటంలో లక్ష్మీనారాయణ కూడా పాల్గొన్నారు. వైఎస్ షర్మిల నాయకత్వంలోని కాంగ్రెస్ ఏయే అంశాలపై అయితే పోరాటం చేసేందుకు సిద్ధమవుతుందో.. ఆ అంశాలపైనే తాము కూడా పోరాడుతామని జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు.

ఈక్రమంలో ఏపీలో కాంగ్రెస్, జై భారత్ పార్టీలు పొత్తు పెట్టుకొని ఎన్నికలు వెళ్లనున్నాయా అనే సందేహం తలెత్తుతోంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని లక్ష్మీనారాయణ ప్రకటించినప్పటికీ.. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న విధి విధానాలకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనుకూలంగా ఉంది. అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో పొత్తు కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. జేడీ లక్ష్మీనారాయణ వంటి వారితో కలిసి పనిచేయడం అటు కాంగ్రెస్‌కు కూడా కలిసొస్తుందనే వాదన వినిపిస్తోంది. ఈక్రమంలో ఎన్నికలు ముంచుకొస్తున్నవేళ ఏపీలో మరో కూటమి ఏర్పాటు కాబోతోందనే మాట గట్టిగా వినబడుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 20 =