ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 19, ఆదివారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 647 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 44 కేసులు నమోదయ్యాయి. నమోదైన మొత్తం 647 పాజిటివ్ కేసులకు గాను 65 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 17 మంది మరణించారు. ప్రస్తుతం 565 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో 97 మండలాలను రెడ్ జోన్ పరిధిగా పరిగణిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 18, శనివారం వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల ఆధారంగా రెడ్‌జోన్ మండలాలను ఖరారు చేసినట్టు పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఉన్న మొత్తం 676 మండలాల్లో 97 మండలాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. రెడ్ జోన్ మండల కేంద్రాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గైడ్ లైన్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఈ రెడ్‌జోన్ లలో 14 రోజుల పాటు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోతే ఆ మండలాన్ని ఆరెంజ్ జోన్ కింద ప్రకటించనున్నారు. అనంతరం ఆ రోజు నుంచి మరో 14 రోజుల పాటు ఎలాంటి కరోనా పాజిటివ్ కేసు నమోదు కాకుంటే ఆ మండలాన్ని గ్రీన్ జోన్ పరిధిలోకి చేర్చనున్నారు. ఇక కర్నూలు జిల్లాలో అత్యధికంగా 17 మండలాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు.
ఏపీలో రెడ్ జోన్ మండలాల వివరాలు:
- కర్నూలు జిల్లా (17): కర్నూలు (అర్బన్), నంద్యాల, బనగానపల్లి రూరల్, పాణ్యం గ్రామీణ, ఆత్మకూరు (అర్బన్), నందికొట్కూరు (పట్టణ), కోడుమూరు, శిరువెళ్ల, చాగలమర్రి, బేతంచెర్ల, గడివేముల, గూడూరు (అర్బన్), ఓర్వకల్లు, అవుకు, పెద్దకడుబూరు, ఉయ్యాలవాడ, ఎమ్మిగనూరు (అర్బన్).
- నెల్లూరు జిల్లా (14): నెల్లూరు (అర్బన్), నాయుడుపేట (అర్బన్), వాకాడు, తడ, అల్లూరు, ఇందుకూరుపేట, బాలాయపల్లె, బోగోలు, బుచ్చిరెడ్డిపాళెం, గూడూరు (అర్బన్), కావలి (అర్బన్), కోవూరు, ఓజిలి, తోటపల్లిగూడూరు.
- గుంటూరు జిల్లా (12): గుంటూరు (అర్బన్), నరసరావుపేట, మాచర్ల (అర్బన్), అచ్చంపేట రూరల్, మంగళగిరి (అర్బన్), పొన్నూరు (అర్బన్), చేబ్రోలు, దాచేపల్లి, కారంపూడి, క్రోసూరు, మేడికొండూరు, తాడేపల్లి (అర్బన్).
- ప్రకాశం జిల్లా (9): ఒంగోలు (అర్బన్), చీరాల (అర్బన్), కారంచేడు, కందుకూరు (అర్బన్), గుడ్లూరు, కనిగిరి (అర్బన్), కొరిసపాడు, మార్కాపురం (అర్బన్), పొదిలి.
- పశ్చిమగోదావరి జిల్లా (9): ఏలూరు (అర్బన్), పెనుగొండ రూరల్, భీమవరం (అర్బన్), తాడేపల్లిగూడెం (అర్బన్), ఆకివీడు, భీమడోలు, ఉండి, కొవ్వూరు (అర్బన్), నరసాపురం (అర్బన్).
- తూర్పుగోదావరి జిల్లా (8): శంఖవరం రూరల్, కొత్తపేట, కాకినాడ గ్రామీణ, పిఠాపురం (అర్బన్), రాజమండ్రి (అర్బన్), అడ్డతీగల, పెద్దాపురం (అర్బన్), రాజమహేంద్రవరం రూరల్.
- చిత్తూరు జిల్లా (8): శ్రీకాళహస్తి (అర్బన్), తిరుపతి (అర్బన్), నగరి (అర్బన్), పలమనేరు, రేణిగుంట, నిండ్ర, వడమాలపేట, ఏర్పేడు.
- కడప జిల్లా (7): ప్రొద్దుటూరు (అర్బన్), కడప (అర్బన్), బద్వేలు (అర్బన్), పులివెందుల (అర్బన్), మైదుకూరు (అర్బన్), వేంపల్లె, ఎర్రగుంట్ల (అర్బన్).
- కృష్ణా జిల్లా (5): విజయవాడ (అర్బన్), పెనమలూరు రూరల్, జగ్గయ్యపేట (అర్బన్), నూజివీడు (అర్బన్), మచిలీపట్నం (అర్బన్).
- అనంతపురం జిల్లా (5): హిందూపురం (అర్బన్), అనంతపురం (అర్బన్), కళ్యాణదుర్గం, కొత్తచెరువు, సెట్టూరు.
- విశాఖపట్నం జిల్లా (3): విశాఖ (అర్బన్), పద్మనాభం, నర్సీపట్నం (అర్బన్).
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu