ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి విశాఖ ఉక్కుపై తీర్మానం చేయాలి: పవన్

#VizagSteelPlant, AP Government, Assembly Resolution on Vizag Steel Plant Issue, Mango News, pawan kalyan, Pawan Kalyan Appealed AP Govt to Pass Assembly Resolution, Privatisation of Visakhapatnam Steel Plant, Privatisation of Visakhapatnam Steel Plant News, privatisation of Vizag Steel Plant, Visakhapatnam, Visakhapatnam Steel Plant, Visakhapatnam Steel Plant Privatisation, Vizag Steel Plant, Vizag Steel Plant staff

విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని, ఇందుకోసమే ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానం చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. “విశాఖ స్టీల్ ప్లాంట్ ఆందోళనల మధ్య సైతం వైసీపీ కార్పోరేషన్ గెలుచుకుంది. 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలతో పాటు నగర పాలక సంస్థను సైతం కైవశం చేసుకున్న వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని మరింత బాధ్యతతో ముందుకు తీసుకు వెళ్లాలి” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

“వైసీపీ ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాం. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడండి. అక్కడ జరుగుతున్న ఆందోళనలు, ఉక్కు పరిశ్రమ నిర్వాసిత రైతుల ఇబ్బందులను రాష్ట్ర ప్రజలకు తెలియచేయండి. మా వంతు సహకారం మేము అందిస్తాం. కార్మికులకు అండగా నిలబడాల్సిన అవసరం వైసీపీ ప్రభుత్వం మీద ఉంది. పాదయాత్రలు చేసి, పత్రిక ప్రకటనలకు పరిమితం అయితే సరిపోదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరగాలని భావిస్తే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. మీరు అలా చేసిన రోజున మావంతు సహకారం మేము అందిస్తాం” అని పవన్ కళ్యాణ్ చెప్పారు.

“విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం భావోద్వేగాలతో కూడుకున్నది. ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతోంది. 8 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు ఈ రోజుకీ పరిహారం అందలేదు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రైతులకు రావాల్సిన పరిహారం కోసం, కార్మికులకు అండగా నిలబడేందుకు మా వంతు కృషి మేము చేస్తున్నాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వినతిపత్రం ఇచ్చాం. ఢిల్లీ వెళ్లి మాట్లాడుదామంటే మాకు పార్లమెంటులో సభ్యులు లేరు. మీకు 22 మంది సభ్యులు ఉన్నారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని వైసీపీ బలంగా ముందుకు తీసుకువెళ్లాలి. సమస్యను ఢిల్లీలోనే పరిష్కరించాలి. ఎండల్లో మాడిపోతున్న కార్మికుల కుటుంబాలకు భరోసా ఇవ్వాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు, వారి కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున మేము అండగా ఉంటాం. మీరు ఒత్తిడి తీసుకురావాల్సింది వైసీపీపైనే. కార్పోరేషన్ ఎన్నికల్లో మెజారిటీ ఓట్లు సాధించిన వైసీపీపై ఒత్తిడి తీసుకురావాలని కార్మిక సంఘాలను కోరుతున్నాం” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − four =