వైసీపీకి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదా?

Is YCP Bound To Lose This Election?, YCP Bound To Lose, YCP Lose This Election, YCP Bound, AP, Telangana, TDP, Janasena, BJP, Congress, YCP, Jagan, Pawan, AP Election, Chandrababu, Mango News, Mango News Telugu
AP, Telangana, TDP, Janasena, BJP, Congress,YCP,Jagan ,Pawan,AP election,Chandrababu

2024 ఎన్నికలలో వైసీపీ ఘోర ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. కూటమి దెబ్బకు జగన్‌ మైండ్‌ బ్లాక్‌ అయ్యిందని క్లియర్‌ కట్‌గా అర్థమవుతోంది. చాలా సర్వేల ఇదే చెబుతున్నాయి. మరోవైపు 2019 నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేసిన పవన్‌ ముందుగా బీజేపీతో జత కట్టి.. గతేడాది నుంచి టీడీపీతోనూ స్నేహం చేశారు.

నిజానికి పవన్‌ ముందునుంచే త్రికూటమిపై దృష్టి సారించారు. పవన్‌పై చాలాసార్లు వైసీపీ నేతలు అసందర్భంగా పర్సనల్ కామెంట్లు చేస్తూ పవన్‌ను అందరికీ దూరం చేద్దామనుకున్నారు.  కానీ ఇప్పుడు వారకి బీజేపీ అండ తీసుకుని చెక్ పెట్టినట్లే అయింది. ఇప్పుడు అఖండ శక్తులన్ని ఏకతాటిపైకి వచ్చాయి. చంద్రబాబు-పవన్‌-మోడీ త్రయాన్ని నిలువరించడం వైసీపీకి సాధ్యపడదన్న వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అందులోనూ ఐదేళ్ల జగన్‌ పాలనతో విసిగిపోయిన ప్రజలు కొత్త నాయకత్వాన్ని కోరుకున్నట్లు తెలుస్తోంది

జనసేనకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రపై మంచి పట్టు ఉంది. ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించేవి ప్రధానంగా ఈ జిల్లాలే. ఇక్కడ పవన్‌ క్యాడర్‌ బలంగా ఉంది. వీరంతా ఇప్పుడు టీడీపీ లేదా బీజేపీలలో ఎవరూ నిలబడినా వారికే ఓటేస్తారు. ఇలా ఓట్లు చీలకుండా పవన్‌ జాగ్రత్త పడుతున్నారు. ఇక కాపుల ఓట్లు కూడా ఈ సారి జనసేనకే. ఉద్యమ నేతలుగా, సంక్షేమ నేతలగా చెప్పుకునే ముద్రగడ, హరిరోమ జోగయ్యను వైసీపీ కోవర్టులుగా కాపు ప్రజలు ముద్ర వేసేసారు. ముందు కాపు సంఘాలకు , పవన్‌కు మంచి చేస్తున్నట్లు  నటించి తర్వాత నిజస్వరూపాన్ని బయట పెట్టుకుంటున్నారని కాపులకు బాగానే అర్థమైంది. దీంతో ఏపీలో మెజారిటీ వర్గమైన కాపు ఓట్లు జనసేన టీమ్‌కే పడడం ఖాయమన్న వార్తలు  వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ఏపీలో పొత్తులు వైసీపీకి భారీ నష్టాన్ని చేకూర్చడం ఖాయం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే నష్టం ఎంత భారీగా ఉంటుదన్నది తేలడానికి ఇంకాస్త సమయం ఉంది. 2019లో 151 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న వైసీపీ ఈ సారి మాత్రం 50లోపు స్థానాలతోనే పరిమితం కావాల్సి ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ విజన్, ముందు చూపూ కలిగిన పవన్‌.. ఐదేళ్లుగా కదుపుతున్న పావులకు వైసీపీ చిత్తైంది. పవన్‌ లాంటి నేతలను తక్కువ అంచనా వేస్తే ఏం అవుతుందో ఈపాటికే జగన్‌కు అర్థమైనా జరగాల్సిన నష్టం జరిగిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + nineteen =