అక్కడ అయితే గెలుపు పక్కానా?

Janasena, Pawan Kalyan, V.S.N. Varma,Gajuwaka, Bhimavaram, YCP, Pitapuram, Bheemavaram, Ycp, TDp, Chandra Babu,AP Elections,Mango News Telugu,Mango News,andhra pradesh
Janasena, Pawan Kalyan, V.S.N. Varma,Gajuwaka, Bhimavaram, YCP, Pitapuram, Gajuwaka, Bheemavaram, Ycp, TDp, Chandra Babu,

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడినుంచి పోటీ చేస్తారనే ప్రశ్న జనసైనికులకే కాదు రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్నాళ్లుగా హాట్ టాపిక్ అయిపోయింది. ఒకసారి భీమవరం నుంచే పోటీ అనే వార్తలు వస్తాయి.  ఇంకోసారి రెండు స్థానాలలో పవన్ పోటీ పక్కా అంటూ ప్రచారం జరిగిపోతుంటుంది. కాదు కాదు రెండు స్థానాలలో పోటీ అన్నది  కరెక్టే కానీ ఒకటి ఎంపీ, మరొకటి ఎమ్మెల్యే స్థానం నుంచి పవన్ పోటీ చేస్తారంటూ మరో న్యూస్  వైరల్ అవుతుంది . అంతే తప్ప పవన్ ఎక్కడినుంచి పోటీ చేస్తారు అనేది కచ్చితంగా మాత్రం తెలియడం లేదు. అయితే రాబోయే  ఎన్నికల్లో పవన్ ఎక్కడ నిలబడ్డా అక్కడ పవన్‌ను విజేతగా నిలుపుతామంటూ, జనసైనికులు అభిమానులు హామీ ఇస్తున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి కానీ, భీమవరం నుంచి  కానీ పోటీ చేసే అవకాశం  అయితే లేదని.. అందుకు వేర్వేరు కారణాలు ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో పవన్ నిలబడ్డ స్థానం  పిఠాపురం అంటూ మరో కొత్త పేరు బయటకు వచ్చింది. సర్వేలలో జనసేనకు అనుకూలంగా ఫలితాలు  ఉండటం, కాపు ఓటర్లు అక్కడ ఎక్కువగా ఉండటంతో ఈ నియోజకవర్గంలో అయితే పవన్  గెలుపు సునాయాసమంటూ రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.  పిఠాపురంలో పవన్ బరిలో నిలిస్తే మాత్రం జనసేనానిని  ఓడించడం వైసీపీకి కూడా ఈజీ కాదన్న  అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

2009 సంవత్సరంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన వంగా గీతను అక్కడి ప్రజలు ఆదరించారు.  అయితే ఇప్పుడు పిఠాపురంలో టీడీపీ ఇన్ ఛార్జ్ గా వీ.ఎస్.ఎన్. వర్మ కొనసాగుతున్నారు. ఒకవేళ పవన్ పోటీ నిలబడటం నచ్చని ఆయన.. రెబల్ అభ్యర్థిగా నిలబడితే మాత్రం పవన్ కు నష్టమని వాదన వినిపిస్తోంది. అది ఒక్కటీ టీడీపీ,జనసేన కూటమి మ్యానేజ్ చేస్తే జనసేన అధినేత గెలుపు పక్కా అన్న వార్తలు వినిపిస్తున్నాయి. కానీ  పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలలో రెండు నియోజకవర్గాలలో పోటీ చేస్తారా  లేక ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

గత ఎన్నికలు ఇచ్చిన అనుభవంతో.. పవన్ కళ్యాణ్ అన్ని విషయాలలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గతంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా  అడుగులు వేస్తున్నారు.  పొత్తులో భాగంగా జనసేనానికి కేటాయించిన 24 సీట్లలో పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేసిన అన్ని సీట్లను  గెలిచేలా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.  పోల్ మేనేజ్మెంట్ తో పాటు,  పొలిటికల్ ప్రమోషన్స్ విషయంలోనూ మరింత దూకుడు పెంచడానికి పవన్ రెడీ అవుతున్నారట.మొత్తంగా వైసీపీ ఊసును ఏపీ వాసులు  మర్చిపోయేలా చేయడానికి ఎన్ని స్ట్రాటజీలు ఫాలో అవ్వాలో అన్ని ఫాలో అవుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE