నిమ్మగడ్డతో అధికార పార్టీకి తలనొప్పి స్టార్ట్

YCP Troubleshooter Entry, Troubleshooter Entry, Troubleshooter, AP CM Jagan, AP, Janasena, Lv Subramanyam, YCP, YSRCP, Politic, Nimmagadda Ramesh,TDP, BJP, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Ap Cm Jagan, Ap, Janasena, Lv Subramanyam, Ycp, Ysrcp, Politic, Nimmagadda Ramesh,TDP, BJP

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. అధికార వైసీపీకి తలనొప్పులు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే అసంతృప్తులు, ప్రతిపక్షాలు, వాలంటీర్ల ఇష్యూ వంటివి జగన్‌కు కత్తిమీద సాములా వెంటాడుతుంటే.. ఇప్పుడు   మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో కొత్త తలనొప్పిగా తయారయ్యారు.టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్..జగన్ ప్రభుత్వంలోనూ  కొంతకాలం పని చేశారు.

నిమ్మగడ్డ రమేష్  అప్పట్లో చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు.  2016లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏపీ ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన నిమ్మగడ్డ రమేష్‌ను.. జగన్ ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల తరువాత  పదవి నుంచి తొలగించారు.

హైదరాబాదులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అప్పటి టీడీపీ ,బీజేపీ నేతలను ఓ ప్రైవేట్ హోటల్లో కలిసారనే వార్తలను వైసీపీ హైలెట్ చేస్తూ అనేక విమర్శలు చేసింది. జగన్ అధికారంలోకి వచ్చాక  మొదటిసారి నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంపై మాట్లాడటానికే ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ  ఆయనపై విమర్శలు చేశారు.

ఆ తర్వాత ఏపీ ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు నుంచి తప్పుకున్నాక.. హైదరాబాద్ వెళ్లిపోయిన నిమ్మగడ్డ ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉండిపోయారు. అయితే తాజాగా ఎలక్షన్ వాచ్ పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేసి ఏపీ వ్యాప్తంగా పర్యటిస్తున్న నిమ్మగడ్డ. .మేధావులు తటస్తులతో కలిసి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ  ఎన్నికలు ఎంత కీలకమో బాగా తెలిసిన వైసీపీ నేతలకు .. నిమ్మగడ్డ  దూకుడు  వారికి  మింగుడు పడడం లేదు.

ఓటర్ల నమోదు ప్రక్రియ నుంచి పోలింగ్ కార్యక్రమం వరకు అన్నీ ఆయనే దగ్గరుండి చూసుకునేలా , న్యాయపరంగా అటు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేలా నిమ్మగడ్డ రమేష్ తన కంపెనీ ద్వారా ప్రయత్నాలు చేస్తుండడం అధికారపార్టీకి మంట పుట్టిస్తుంది. కొద్ది కాలం క్రితం వాలంటీర్లు దొంగ ఓటర్లను నమోదు చేయించారంటూ.. నిమ్మ గడ్డ రమేష్‌కు చెందిన కంపెనీ ఈసీకి ఫిర్యాదు చేయడంతో వైసీపీ నాయకులు వణికిపోతున్నారు.

నిమ్మగడ్డ ఆధ్వర్యంలో ఉన్న సిటిజన్ ఫర్ డెమోక్రసీ తాజాగా వాలంటీర్ల వ్యవహారం మీద కూడా మరోసారి ఈసీకి  ఫిర్యాదు చేయడంతో..  వారిని పింఛన్ల పంపిణీ,  రేషన్ తదితర విధులను తప్పించింది. నిమ్మగడ్డ రమేష్‌తో పాటు, మాజీ ఏపీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం వంటి వారు సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థలు టార్గెట్ చేసుకోవడంతో అధికార పార్టీకి వెన్నులో వెనుకు పుడుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 8 =