కొత్తగా పెన్షన్ అందుకోనున్న 2,20,385 మంది, రేపే ఏపీలో పెన్షన్ల పంపిణీ

AP Govt will Distribute Pension to 61.28 Lakhs People, ap pension scheme, AP YSR Pension Kanuka, YSR Pension Kanuka, YSR Pension Kanuka Distribution, YSR Pension Kanuka in AP, YSR Pension Kanuka News, YSR Pension Kanuka Updates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 1న వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీకి రంగం సిద్ధమైంది. ఒకే రోజున రాష్ట్ర వ్యాప్తంగా 61.28 లక్షల మంది లబ్ధిదారులకు నేరుగా ఇంటి వద్దనే పెన్షన్ అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రూ.1478.90 కోట్లును ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. మరోవైపు ఈ నెల నుండి కొత్తగా 2,20,385 మంది పెన్షన్స్ అందుకోనున్నారు. 1568 మందికి కొత్తగా హెల్త్ పెన్షన్లు కూడా మంజూరు చేశారు.

అలాగే ఈ నెల నుంచి రాష్ట్రంలో బ్రాహ్మిణ్‌ కార్పోరేషన్ ద్వారా నెలకు చెల్లించే రూ.2వేలు పెన్షన్లను కూడా, వైఎ​స్సార్‌ పెన్షన్ కానుక కిందకు తెచ్చి, నెలకు రూ.2250 చొప్పున చెల్లించనున్నారు. వీరికి కూడా ఇకపై వాలంటీర్ల ద్వారానే ఒకటో తేదీనే పెన్షన్ అందించనున్నారు. రాష్ట్రంలో 2.68 లక్షల మంది వాలంటీర్లు పెన్షన్ డబ్బును పంపిణీ చేసేందుకు సిద్ధంగా వున్నారు. కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్‌కు బదులుగా జియో ట్యాగింగ్‌తో ఫోటోలను తీసుకుని, లబ్దిదారులకు పెన్షన్ అందజేయనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =