ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రైలు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం, మరికొందరికి తీవ్ర గాయాలు

Andhra Pradesh Five People Demise in a Train Accident at Srikakulam, Five People Demise in a Train Accident at Srikakulam, Train Accident at Srikakulam, Five People Demise in a Train Accident, Srikakulam, Srikakulam Train Accident, Five People Demise after train runs them over in Andhra Pradesh's Srikakulam, 5 People Killed As Speeding Express Train Runs Over Them In Andhra Pradesh's Srikakulam, 5 People killed as train runs over them in Andhra Pradesh's Srikakulam, Five killed as train runs over them, Five passengers run over by train, Train ran over Five People while crossing the Track in Andhra Pradesh's Srikakulam, train accident in andhra pradesh, Srikakulam Train Accident News, Srikakulam Train Accident Latest News, Srikakulam Train Accident Latest Updates, Srikakulam Train Accident Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని జి సిగడాం మండలం బాతువా అనే స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి వేగంగా వస్తున్న రైలు ఢీకొని కనీసం ఐదుగురు మృతి చెందగా, మరికొంత మంది గాయపడ్డారు. సాంకేతిక లోపంతో సికింద్రాబాద్‌-గౌహతి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బాతువా రైల్వే గేట్‌ దగ్గర నిలిచిపోయింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ప్రయాణీకులలో కొందరు వారు ప్రయాణిస్తున్న గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలు నుండి పొగలు రావడాన్ని గమనించారు, దీంతో అప్రమత్తమై అత్యవసర గొలుసును లాగారు. రైలు నిలిచాక అధిక వేడి కారణంగా, కొంతమంది ప్రయాణికులు చల్లటి గాలిని పొందడానికి రైలు నుండి క్రిందికి దిగారు. రైలు నుండి దిగిన ప్రయాణికులు ఇతర ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే అదే సమయంలో వారు నిల్చున్న ట్రాక్‌పై వేగంగా వచ్చిన కోణార్క్ ఎక్స్‌ప్రెస్ వారిపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.

రైల్వే పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు, మేము ఐదు మృతదేహాలను గుర్తించాము. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, పూర్తి సమాచారం తెలియాలంటే మరికొంత సమయం పడుతుందని శ్రీకాకుళం పోలీసు సూపరింటెండెంట్ రాధిక తెలిపారు. కాగా క్షతగాత్రులను హుటాహుటిన చీపురుపల్లి లోని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రైల్వే, జిల్లా యంత్రాంగంలోని ఉన్నతాధికారులతో మాట్లాడి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఉద్ఘాటించారు. విశాఖపట్నం, శ్రీకాకుళం రైల్వే ఉన్నతాధికారులు కూడా పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో.. “జి సిగ్దాం మండలం బటువా ప్రాంతంలో రైలు ఢీకొని కొంతమంది మరణించారు మరియు మరికొందరు గాయపడ్డారు. మృతుల పట్ల ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేసి ఆదేశించారు. క్షతగాత్రులకు అధికారులు మంచి వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు” అని తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 8 =