ఏపీలో నామినేటెడ్ పోస్టుల ప్రకటన, పలు సంస్థల చైర్మన్లు వీరే…

Andhra govt announces 135 nominated posts, andhra pradesh chief minister, Andhra Pradesh Nominated Posts Announced Today, Andhra Pradesh State Nominated Posts Announced, Andhra Pradesh State Nominated Posts Announced Today, AP govt announces nominated posts, AP Nominated Posts, AP Nominated Posts 2021, AP Nominated posts announced, Mango News, Pics Mark Appointments

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్‌ పోస్టులను శనివారం నాడు ప్రకటించారు. ఈ నామినేటెడ్‌ పోస్టుల నియామకాల వివరాలను మంత్రులు మేకతోటి సుచరిత, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎంపీలు నందిగం సురేష్, మోపిదేవి వెంకటరమణ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారని తెలిపారు. మొత్తం 135 కార్పొరేషన్లు, సంస్థలకు ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించగా, 68 మంది మహిళలకు, 67 మంది పురుషులకు పదవులు ఇచ్చారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే 76 శాతం పదవులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కొన్ని నామినేటెడ్‌ పోస్టుల నియామకాల వివరాలు:

 • స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛైర్మన్ – బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి
 • ఏపీఐఐసీ ఛైర్మన్‌ – మెట్టు గోవిందరెడ్డి
 • పౌర సరఫరాల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ – ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి
 • డీసీసీబీ ఛైర్మన్‌ – నాయుడుబాబు
 • డీసీఎంఎస్ ఛైర్మన్‌ – అవనపు భావన
 • కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ – అడపా శేషు
 • ఆర్టీసీ రీజనల్‌ ఛైర్మన్‌ – గాదల బంగారమ్మ
 • వీఎంఆర్డీఏ ఛైర్మన్‌ – అక్కరమాని విజయనిర్మల
 • గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ – రెడ్డి పద్మావతి
 • టిడ్కో ఛైర్మన్‌ – జమ్మాన ప్రసన్నకుమార్‌
 • ఏపీ గ్రీనింగ్‌ బ్యూటీ కార్పొరేషన్ ఛైర్మన్‌ – ఎన్‌.రామారావు
 • బొబ్బిలి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌ – పార్వతి
 • ఏపీ మారిటైం బోర్డ్‌ ఛైర్మన్‌ – కాయల వెంకటరెడ్డి
 • అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌ – కోరాడ ఆశాలత
 • కోపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌ – చల్లా సుగుణ
 • తిరుపతి స్మార్ట్‌ సిటీ అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ – నరమల్లి పద్మజ
 • ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌ – నసీర్‌ అహ్మద్‌
 • బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ – సుధాకర్‌
 • ఏపీ మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ – షేక్‌ ఆసిఫ్‌
 • ఉమెన్స్‌ కోపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ – హేమమాలినిరెడ్డి
 • ఏపీ సామాజిక న్యాయ సలహాదారు – జూపూడి ప్రభాకర్‌రావు

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here