ఏలూరులో రూ. 3,758 కోట్ల మొదటి విడత ‘వైఎస్సార్‌ రైతు భరోసా 2022-23’ నిధులు విడుదల చేసిన సీఎం జగన్

CM Jagan Disburse First Installment Rs 3758 Cr of YSR‌ Rythu Bharosa 2022-23 in Eluru Today, AP CM YS Jagan Disburse First Installment Rs 3758 Cr of YSR‌ Rythu Bharosa 2022-23 in Eluru Today, CM YS Jagan Disburse First Installment Rs 3758 Cr of YSR‌ Rythu Bharosa 2022-23 in Eluru Today, First Installment Rs 3758 Cr of YSR‌ Rythu Bharosa Funds, YS Jagan Eluru Tour, CM Jagan Eluru Tour, AP CM YS Jagan Eluru Tour, CM YS Jagan Eluru Tour, YSR‌ Rythu Bharosa Funds, YS Jagan Eluru Tour News, YS Jagan Eluru Tour Latest News, YS Jagan Eluru Tour Latest Updates, YS Jagan Eluru Tour Live Updates, YSR‌ Rythu Bharosa Funds disbursed to farmers, 3758 Cr of YSR‌ Rythu Bharosa Funds disbursed to farmers, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, AP CM, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేడు ఏలూరు జిల్లా పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం లోని చింతలపాటి మూర్తి రాజు డిగ్రీ కాలేజీలో ‘వైఎస్సార్‌ రైతు భరోసా 2022-23’ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీని ద్వారా 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హత పొందిన 50,10,275 రైతు కుటుంబాలకు తొలి విడతగా నేడు రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయం అందనుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన వేదిక పై నుంచి సీఎం జగన్‌ కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు. జగన్ సర్కార్ ‘వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌’ కింద సంవత్సరానికి రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తోంది. నిధుల విడుదల కార్యక్రమం అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ..

  • రైతులకు ఏటా రూ.13,500 చొప్పున.. మేలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4వేలు, జనవరిలో మిగిలిన రూ.2వేలు చొప్పున అందిస్తున్నాం
  • దీనిలో భాగంగా.. ఈ యేడాది ఖరీఫ్‌ పనులు మొదలు కాక ముందే ఈరోజు రూ. 5,500 నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం
  • ఏపీలో ఇప్పటి వరకు రైతు భరోసా కింద రూ.23,875 కోట్లు జమ చేశాం
  • గత ప్రభుత్వంలో వడ్డీ లేని రుణాలకు ఐదేళ్లలో చెల్లించింది రూ.782 కోట్లు కాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడేళ్లలో ఇచ్చింది రూ.1282 కోట్లు.
  • ప్రస్తుతం రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 16 లక్షల టన్నులు పెరిగింది
  • ఉచిత పంటల బీమా ద్వారా 31 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది.
  • కేంద్రం ప్రకటించని పంటలకు కూడా మద్దతు ధర కల్పించి కొనుగోలు చేస్తున్నాం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =