ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం

Andhra Pradesh, Andhra Pradesh HC, Andhra Pradesh Zilla Parishad Territorial Constituencies, AP MPTC ZPTC Election Results, AP MPTC ZPTC Election Results 2021, Mandal Parishad Territorial Constituencies, Mango News, MPTC ZPTC Elections Counting, YSRCP Sweeps Majority Of Votes, YSRCP Sweeps Majority Of Votes In ZPTC And MPTC Elections Against TDP, YSRCP Sweeps MPTC and ZPTC Polls, ZPTC MPTC polls

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవగా, పలు స్థానాల్లో అర్ధరాత్రి వరకు లెక్కింపు కొనసాగింది. కాగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 13 జిల్లాల్లో మెజార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఇక టీడీపీ, బీజేపీ, జనసేన, ఇతర పార్టీలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపగలిగాయి. ఓట్లలెక్కింపు అనంతరం ఫలితాల వివరాలను అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలో ముందుగా మొత్తం 515 జెడ్పీటీసీ స్థానాలు, 7,219 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 7,219 ఎంపీటీసీ స్థానాలకు గానూ వైఎస్సార్సీపీ 5,998 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక 826 స్థానాల్లో టీడీపీ, 177 స్థానాల్లో జనసేన, 28 స్థానాల్లో బీజేపీ, 15 స్థానాల్లో సీపీఎం, 8 స్థానాల్లో సీపీఐ, 157 స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. అలాగే 515 జెడ్పీటీసీ స్థానాలకు గానూ, వైఎస్సార్సీపీ 502 స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ 6 చోట్ల, జనసేన 2, సీపీఎం మరియు స్వతంత్రులు ఒక్కో స్థానంలో విజయం సాధించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − thirteen =