ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్న భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ

Team India Batter Virat Kohli Won the ICC Men's Player of the Month Award for October 2022,Team India Batter Virat Kohli ,Virat Kohli Won the ICC Men's Player ,Player of the Month Award for October 2022,Mango News,Mango News Telugu,Virat Kohli 34th Bday, Virat Kohli Latest News And Updates, Virat Kohli Birthday, Virat Kohli Birthday 2022, Virat Kohli Bday Celebrations Latest Updates, Virat Kohli News And Live Updates

భారత్ స్టార్ బ్యాటర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) “ప్లేయర్ అఫ్ ది మంత్” అవార్డుకు ఎంపికయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ అన్ని రకాల ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శనలకు సంబంధించి మెన్ మరియు ఉమెన్ క్రికెటర్ల విభాగాల్లో ఐసీసీ “ప్లేయర్ ఆఫ్ ది మంత్” అవార్డు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2022, అక్టోబర్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును విరాట్ కోహ్లీ గెలుచుకున్నాడు. అక్టోబర్ నెలలో టీ20 ఫార్మాట్‌లో కొన్ని అద్భుతమైన ప్రదర్శనలకు గానూ విరాట్ కోహ్లీ ఈ అవార్డుకు ఎంపికయినట్టు ఐసీసీ తెలిపింది. నామినేషన్స్ లో జింబాబ్వేకు చెందిన సికందర్ రజా, దక్షిణాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్ కూడా ఉన్నప్పటికీ ఓటింగ్ లో వారిని ఓడించి విరాట్ ఈ అవార్డు దక్కించుకున్నట్టు తెలిపారు.

విరాట్ కోహ్లీ అక్టోబర్‌లో కేవలం నాలుగు టీ20 ఇన్నింగ్స్‌లలో మాత్రమే బ్యాటింగ్ చేశాడు. అయితే ఇందులో ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న T20 ప్రపంచ కప్‌-2022లో భాగంగా అక్టోబర్ 23న పాకిస్తాన్‌పై 53 బంతుల్లో చేసిన 82 పరుగుల (నాటౌట్) చిరస్మరణీయమైన ఇన్నింగ్, అక్టోబర్ 27న నెదర్లాండ్స్ పై 44 బంతుల్లో 62 పరుగులు, అలాగే అక్టోబర్ ప్రారంభంలో గౌహతిలో దక్షిణాఫ్రికాపై కేవలం 28 బంతుల్లో 49 పరుగులు వంటి ఇన్నింగ్స్ ఉన్నాయని తెలిపారు. T20 ప్రపంచ కప్‌-2022 వంటి మెగా ఈవెంట్‌లో భారత్ సెమీఫైనల్‌కు చేరుకోవడంలో కోహ్లి కీలక పాత్ర పోషించాడని తెలిపారు.

ఈ అవార్డు అందుకోవడంపై కోహ్లీ స్పందిస్తూ, “అక్టోబరు నెలలో ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపిక కావడం నాకు గొప్ప గౌరవం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులతో పాటు ప్యానెల్ కూడా అత్యుత్తమ ఆటగాడిగా ఎంపిక చేయడం వల్ల ఈ ఘనత నాకు మరింత ప్రత్యేకం. ఈ నెలలో చాలా బాగా ప్రదర్శన చేసిన ఇతర నామినీలకు అభినందనలు. అలాగే నా సామర్థ్యం మేరకు అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి నాకు మద్దతునిచ్చే నా సహచరులకు కూడా ధన్యవాదాలు చెబుతున్నాను” అని పేర్కొన్నాడు.

మరోవైపు అక్టోబర్, 2022 నెలకు గానూ ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును పాకిస్తాన్ ఆల్ రౌండర్ నిదా దార్ గెలుచుకుంది. అక్టోబర్ లో మహిళల ఆసియా కప్‌లో కొన్ని అద్భుతమైన ప్రదర్శనల గానూ ఆమె ఈ అవార్డుకు ఎంపికయింది. నామినేషన్స్ లో భారత్ కు చెందిన జెమిమా రోడ్రిగ్స్ మరియు దీప్తి శర్మ నుంచి పోటీ ఎదుర్కున్న నిదా దార్, ముందంజలో నిలిచి ఈ అవార్డు దక్కించుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 10 =