ఏపీలో ఇకపై ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్రకు స్వస్తి, రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందాలి – సీఎం జగన్

AP CM Jagan Held Review Meet on Agriculture Department Orders Officials Over Grain Collection in The State, AP CM YS Jagan Mohan Reddy,CM YS Jagan, Jagan Held Review Meet on Agriculture Department,Mango News,Mango News Telugu,Agriculture Department Orders Officials,Grain Collection in AP, Andhra Pradesh Latest News And Updates,AP CM Jagan Latest News And Live Updates,AP CM Jagan,Jagan Agriculture Department,Agriculture Department Meeting With Jagan

ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్రకు స్వస్తి చెప్తున్నామని, కొనుగోళ్లలో రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన సోమవారం వ్యవసాయ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు మరియు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కొన్ని కీలక సూచనలు చేశారు.

వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం జగన్ అధికారులకు చేసిన కొన్ని సూచనలు..

  • ఏపీలో ఇకపై ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్రను తీసివేస్తున్నాం. ఈ మేరకు అధికారులు దృష్టి సారించాలి.
  • తద్వారా రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందేలా చూడాలి.
  • అలాగే ధాన్యాన్ని అత్యంత పటిష్ట విధానంలో సేకరించేందుకు ఇ-క్రాపింగ్ పద్దతిని వినియోగించుకోవాలి.
  • ఎక్కడా రైతులు తమ ధాన్యాన్ని ఎంఎస్పీ కన్నా తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చిందని భావించకూడదు.
  • వ్యవసాయ శాఖ అధికారులు రాబోయే రబీ సీజన్ కోసం ఇప్పటినుంచే అన్ని విధాలా సమాయత్తం కావాలి.
  • రైతులకు విత్తనాలు, ఎరువులు వంటివి సకాలంలో అందించాలి. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలి.
  • రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్బీకే కేంద్రాల్లో డ్రోన్స్ ఏర్పాటు చేయాలి. వచ్చే రెండేళ్లలో ఈ లక్ష్యాన్ని అందుకోవాలి.
  • అలాగే ప్రతి ఆర్బీకే కేంద్రంలో భూసార పరీక్షలు నిర్వహించే అధునాతన పరికరాలు అందుబాటులో ఉంచాలి.
  • దీనివలన రైతులకు పంటకు పెట్టే పెట్టుబడులు తగ్గి దిగుబడులు పెరుగుతాయి.
  • వచ్చే మార్చి నాటికి దీనిని ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకోవాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =