జనవరి 1 నుంచి ఇంటింటికి నాణ్యమైన రేషన్ బియ్యం సరఫరా, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

Andhra Pradesh cabinet, AP Cabinet, AP Cabinet Decisions, AP Cabinet Highlights, AP Cabinet Key Decisions, AP Cabinet Latest News, AP Cabinet Meet, New Sand Policy, New Sand Policy Approved, Re-survey Project Approved

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన నవంబర్ 5, గురువారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్‌ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండున్నర గంటల పాటుగా సాగిన కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మీడియాకు వివరించారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు:

  • జనవరి 1 నుంచి ఇంటింటికి నాణ్యమైన రేషన్ బియ్యం సరఫరాకు ఆమోదం, బియ్యం సంచులపై క్యూఆర్ కోడ్ ముద్రణ.
  • రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం.
  • కేబినెట్ సబ్‌కమిటీ నివేదిక ప్రకారం నూతన ఇసుక విధానంకు కేబినెట్ ఆమోదం, ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కూడా ఇసుక బుక్ చేసుకునే అవకాశం. ‌రాష్ట్రవ్యాప్తంగా ఇసుక రీచ్ లను ఒకే సంస్థ లేదా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు ఇవ్వాలని నిర్ణయం. కేంద్ర సంస్థ ముందుకు రాకుంటే బహిరంగ వేలం వేయాలని నిర్ణయం.
  • చిరు వ్యాపారులకు వడ్డీలేని రూ.10 ఋణం అందించే ‘జగనన్న చేదోడు’ పథకానికి ఆమోదం.
  • మచిలీపట్నం పోర్టు డీపీఆర్‌కు ఆమోదం. రూ.5,835 కోట్లతో 36 నెలల్లో పోర్టు నిర్మాణం.
  • విజయనగరం జిల్లా గాజులరేగలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 80 ఎకరాలు, పాడేరులో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 35 ఎకరాల భూమి కేటాయింపుకు ఆమోదం.
  • అగ్నిమాపక శాఖలో నాలుగు జోన్ల ఏర్పాటుకు నిర్ణయం.
  • జైలు సూపెరిండెంటెంట్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం.
  • ఎస్‌ఈబీ పరిధిలోకి గుట్కా, జూదం, మత్తు పదార్ధాలుతో పాటుగా ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ కూడా తీసుకురాలని నిర్ణయం.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − fifteen =