ఏపీలోని 57వేలమంది సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీలకు సెల్‌ఫోన్ల పంపిణీ ప్రారంభించిన సీఎం జగన్

CM YS Jagan Starts Distribution of Cell Phones to 57000 Supervisors and Anganwadis in AP, YS Jagan Starts Distribution of Cell Phones, YS Jagan Distribution of Cell Phones Supervisors and Anganwadis, Anganwadis in AP, Mango News, Mango News Telugu, AP CM YS Jagan Review Meeting, Ap Cm Lays Emphasis On Women, Ap Cm Ys Jagan Holds Review Meeting, Anganwadi Food Chart 2022, Anganwadi Food Supply, Anganwadi Food Menu In Ap, Ap Anganwadi Scheme, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan Latest News And Updates

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని దాదాపు 57,000 మంది సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీలకు ప్రభుత్వం తరపున సెల్‌ఫోన్లు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. బుధవారం ఆయన మహిళా, శిశు సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, ముఖ్య కార్యదర్శి రవిచంద్ర, ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణ, మార్క్‌ఫెడ్‌ ఎండీ ప్రద్యుమ్న సహా ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారికి పలు కీలక ఆదేశాలు, సూచనలు ఇచ్చారు.

సీఎం జగన్ చేసిన కొన్ని కీలక సూచనలు..

  • రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీలలో అవసరమైన సదుపాయాలు కల్పించాలి.
  • గర్భిణీలు, బాలింతల్లో రక్తహీనత మరియు చిన్నారుల్లో పౌష్టికాహారలోపం నివారణకు చర్యలు చేపట్టాలి.
  • డిసెంబర్‌ నుంచి మార్క్‌ఫెడ్​కు పౌష్టికాహార పంపిణీ బాధ్యతలు ఇస్తున్నాం.
  • మార్క్‌ఫెడ్‌ ద్వారా ఆహారం పంపిణీ చేయాలి. అలాగే థర్డ్‌పార్టీతో నాణ్యతా పరీక్ష చేయించాలి.
  • అంగన్​వాడీలలో అందించే పౌష్టికాహార పంపిణీని ప్రత్యేక యాప్‌ల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలి.
  • నవంబర్ నుంచి గుడ్ల పంపిణీపై కూడా యాప్ ద్వారా పర్యవేక్షించాలి.
  • దీనికోసం అంగన్​వాడీలు, సూపర్​వైజర్లకు సెల్​ఫోన్లు పంపిణీ చేస్తున్నాం.
  • సెల్​ఫోన్ ద్వారా నిరంతరం డేటాను అప్​డేట్ సహా పర్యవేక్షణ చేయాలి.
  • అంగన్​వాడీలలో పిల్లలకు అందించే పాలు, గుడ్లు వంటివి పాడవకుండా నిల్వ ఉంచేందుకు ఫ్రిడ్జ్ లు అందించేలా చర్యలు తీసుకోవాలి.
  • గతంలో పిల్లల భోజనానికి నెలకు రూ.500 కోట్లు కేటాయిస్తే, ప్రస్తుతం రూ.1900 కోట్లు ఖర్చుచేస్తున్నాం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − four =