వైస్సార్సీపీలో ముగ్గురు నేతలకు కీలక బాధ్యతలు అప్పగింత

Andhra Pradesh, AP CM YS Jagan Allotted Party Responsibilities, AP News, AP Political Updates, Vijay Sai Reddy, YS Jagan Allotted Party Responsibilities, YS Jagan Allotted Party Responsibilities to Three Main Leaders

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ముగ్గురు కీలక నేతలకు బాధ్యతలను అప్పగించారు. వైసీపీ పార్టీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయ సాయిరెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి జిల్లాల్లో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేలా బాధ్యతలు అప్పగించారు. అలాగే పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతలను విజయ సాయిరెడ్డికి, తాడేపల్లిలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయ సమన్వయ బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షించే జిల్లాలు:

 • శ్రీకాకుళం
 • విజయనగరం
 • విశాఖపట్నం

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పర్యవేక్షించే జిల్లాలు:

 • పశ్చిమ గోదావరి
 • తూర్పుగోదావరి
 • కృష్ణా
 • గుంటూరు
 • చిత్తూరు

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పర్యవేక్షించే జిల్లాలు:

 • కర్నూలు
 • అనంతపురం
 • కడప
 • నెల్లూరు
 • ప్రకాశం

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here