స్వరాజ్‌ మైదాన్‌లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు పనులు 13 నెలల్లోగా పూర్తవ్వాలి – సీఎం జగన్

Ambedkar Statue, Ambedkar statue in PWD grounds, Andhra Pradesh, andhra pradesh chief minister, AP CM, AP CM YS Jagan, Construction of Ambedkar Statue, Construction of Ambedkar Statue in Vijayawada, Vijayawada, Vijayawada Ambedkar Statue, Vijayawada Construction of Ambedkar Statue, YS Jagan, YS Jagan Review on Construction of Ambedkar Statue

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. విజయవాడ నగరంలోని బీఆర్‌ అంబేద్కర్‌ స్వరాజ్‌ మైదాన్‌లో 125 అడుగుల అంబేద్కర్‌‌ విగ్రహం ఏర్పాటు, పార్క్‌ అభివృద్ది చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విగ్రహం ఏర్పాటు, పార్క్ అభివృద్ధి ప్లాన్ పై వివిధ సంస్థల ప్రతినిధులు పలు నమూనాలును ప్రజెంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, అంబేద్కర్‌ విగ్రహం తయారీకి వెంటనే ఆర్డర్‌ ఇవ్వాలని సూచించారు. నవంబర్ 1 నుంచి పనులు మొదలుపెట్టి 13 నెలల్లోగా పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. అంబేద్కర్‌ విగ్రహం ఎక్కడి నుంచి చూసినా స్పష్టంగా కనిపించాలని, విజిబిలిటీ ముఖ్యమని సూచించారు.

అలాగే అక్కడ నిర్మించే పార్కులో కూడా పూర్తిస్థాయిలో ఆహ్లాదకర వాతావరణం కలిగి ఉండేలా నిర్మాణం చేపట్టాలని చెప్పారు. పార్కులో ఒక కన్వెన్షన్‌ హాల్‌ కూడా ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుదని సీఎం పేర్కొన్నారు. కన్వెన్షన్‌ హల్, ఫుడ్‌ కోర్టును మాత్రం కమర్షియల్‌ పద్దతిలో నడిపి, వాటిపై వచ్చే ఆదాయాన్ని పార్క్‌ నిర్వహణ ఉపయోగించవచ్చని సూచించారు. పార్క్ నిర్మాణంలో కాంక్రీట్‌ నిర్మాణాలు సాధ్యమైనంత తగ్గించి, ప్రజలకు ఉపయోగపడేలా వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here