రేపు విశాఖ పర్యటనకు సీఎం జగన్.. జీ-20 ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం

AP CM YS Jagan To Visit Visakhapatnam For Attending G20 Meeting Tomorrow,AP CM YS Jagan To Visit Visakhapatnam,AP G20 Meeting Tomorrow,CM YS Jagan Attending G20 Meeting,Mango News,Mango News Telugu,CM YS Jagan Mohan Reddy to arrive in Vizag,Andhra Pradesh To Host G20 Meet,Latest News on Jagan Meeting,CM Jagan Concluding Speech,Global Investors Summit,AP Clinches Investments,AP attractS 13 lakh crore Investment,Andhra Pradesh received investments,G20 Summit,G20 Summit 2023,G20 India,G20 Summit 2023 India LIVE,G20 Summit LIVE,G20 India LIVE,G20 India 2023,2023 G20

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన మార్చి 28, 29 తేదీల్లో జరుగుతున్న రెండో జీ-20 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమ్మిట్‌లో పాల్గొననున్నారు. రేపు సాయంత్రం సీఎం జగన్ జీ-20 ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ రేపు సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 5:15 గంటలకు విశాఖ చేరుకుంటారు. ఈ క్రమంలో సాయంత్రం 6 గంటలకు రిషికొండ లోని రాడిసన్ బ్లూ రిసార్ట్స్ వద్దకు చేరుకొని రాత్రి 7నుంచి 8 గంటల వరకూ జీ-20 ప్రతినిధులతో జరిగే ఇంట్రడక్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు. దీని తర్వాత అతిథుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న ‘గాలా డిన్నర్’ విందులో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం రాత్రి 8:45 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి రాత్రి 10 గంటలకు తాడేపల్లి చేరుకోనున్నారు.

కాగా విశాఖపట్నం వేదికగా మార్చి 28, 29 తేదీల్లో రెండు రోజుల పాటు జరుగనున్న జీ-20 సదస్సుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూచేశారు. ఈ ఏర్పాట్ల కోసం సీఎం జగన్ ఆదేశాల మేరకు దాదాపు రూ.157 కోట్లు కేటాయించారు. దీంతో నగరంలో శాశ్వత ప్రాతిపదికన నగర సుందరీకరణ పనులు చేపట్టారు. అలాగే ఈ సదస్సుకు వివిధ దేశాల నుంచి సుమారు 200 మంది ప్రతినిధులు వస్తున్నట్లు తెలిపిన అధికారులు వారికి అవసరమైన రవాణా, వసతి, భద్రత తదితర ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. సమావేశాల ఏర్పాట్లలో భాగంగా విదేశీ ప్రతినిధులు సందర్శించే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశామని వెల్లడించిన అధికారులు, శాశ్వత ప్రాతిపదికన 46 కిలోమీటర్ల బిటి రోడ్డు పనులు, 24 కిలోమీటర్ల మేర పెయింటింగ్‌ పనులు, పది కిలోమీటర్ల మేర ఫుట్‌పాత్‌ నిర్మాణం వంటివి చేపట్టినట్లు తెలియజేశారు.

ఈ సదస్సులో జీ20 దేశాలు సహా పలు యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా ఈ సదస్సులో జీ20 దేశాలు సహా పలు యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఇటీవలే ముగిసిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత, విశాఖపట్నం తాజాగా జీ-20 ‘వన్ ఎర్త్-ఒక ఫామిలీ-వన్ ఫ్యూచర్’ థీమ్ కలిగిన జీ-20 సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుండటం గమనార్హం. ఇక జీ-20 సమావేశాలను కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ లాంఛనంగా ప్రారంభిచనున్నారు. ఈ సదస్సుకు వచ్చే విదేశీ ప్రతినిధులకు రాష్ట్రానికి సంబంధించిన పూర్తి సమాచారం అందించడంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం జగన్ సూచన మేరకు ఏపీ అధికారులు వివరించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here