ముగిసిన సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కీలక భేటీ, విభజన సమస్యలపై విజ్ఞప్తి

AP CM YS Jagan Meets Union Home Minister Amit Shah To Appeal on State Bifurcation Issues During Delhi Visit,AP CM YS Jagan Meets Union Home Minister,Union Home Minister Amit Shah,Amit Shah To Appeal on State Bifurcation Issues,Amit Shah During Delhi Visit,Mango News,Mango News Telugu,AP CM YS Jagan Meets Amit Shah,AP State Bifurcation Issues,Jagan discusses Andhra-related issues,CM Jagan Meets HM Amit Shah,AP CM YS Jagan Mohan Reddy,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. నేడు (సోమవారం, మే 29, 2023) ఆయన ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్నారు. ఇక మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్ శనివారం నీతి అయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్నారు. నిన్న (ఆదివారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగిన నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు అనుగుణంగా నిధులు మంజూరుకు సహకారం అందించాల్సిందిగా కోరారు.

ఆ తర్వాత ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన నివాసంలో సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు జరిగిన వీరి భేటీలో ఏపీ విభజనకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్ సహా షెడ్యూల్ 9,10 ఆస్తుల విభజనపై కూడా దృష్టి సారించాలని కోరారు. అలాగే తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను వీలైనంత త్వరగా ఇప్పించాలని హోంమంత్రి అమిత్ షాకు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. దీనితో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here