‘జగనన్న పచ్చతోరణం’ ప్రారంభించిన సీఎం జగన్‌, 20 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం

Andhra Pradesh, Andhra Pradesh Latest News, Andhra Pradesh News, Andhra Pradesh Political News, Andhra Pradesh Political Updates, AP Jagananna Pacha Thoranam Program, Jagananna Pacha Thoranam, Jagananna Pacha Thoranam Program, Jagananna Pacha Thoranam Program In AP, YS Jagan Started Jagananna Pacha Thoranam Program

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జూలై 22, బుధవారం నాడు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గాజులపేటలో మొక్కలు నాటి ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 71వ వన మహోత్సవంలో భాగంగా త్వరలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం చేసిన లే అవుట్ వద్ద సీఎం వైఎస్ జగన్ వేప, రావి మొక్కలు నాటి, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌ మాట్లాడుతూ, ఈ సంవత్సరం వన మహోత్సవంలో భాగంగా 20 కోట్ల మొక్కల్ని నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజలతో మొక్కలు నాటే అంశంపై ప్రతిజ్ఙ చేయించారు. అలాగే ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం రోజున రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై టీడీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుపడుతున్నారని విమర్శించారు. దేవుడి దయతో అడ్డంకులన్నీ తొలగిపోతే ఆగస్టు 15న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =