ఈ నెల 28న నూతన పార్లమెంట్‌ భవనం ప్రారంభం.. కేంద్రం తీరుపై విపక్షాల ఆగ్రహం, బహిష్కరించిన 20 పార్టీలు

PM Modi To Inaugurate New Parliament Building on May 28th 20 Opposition Parties Announces Boycott The Opening Ceremony,PM Modi To Inaugurate New Parliament Building,New Parliament Building on May 28th,20 Opposition Parties Announces Boycott,Opposition Parties Announces Boycott The Opening Ceremony,Mango News,Mango News Telugu,PM Modi Latest News and Updates,New Parliament Building Latest News,New Parliament Opening Ceremony Latest News,New Parliament Opening Ceremony Latest Updates,Parliament Building Boycott Latest News

భారతదేశం యొక్క నూతన పార్లమెంట్ భవనం ఆదివారం (మే 28, 2023) ప్రారంభించబడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా దీనిని ప్రారంభించనున్నారు. అయితే దీనిపై దేశంలోని అత్యధిక ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాయి. కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాల్సింది రాష్ట్రపతి అని, ప్రధాని కాదని ప్రతిపక్షాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సహా దాదాపు 20 విపక్ష పార్టీలు కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ సందర్భంగా.. ‘దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రభుత్వం పరిహసిస్తున్నా, కొత్త పార్లమెంట్‌ నిర్మాణం విషయంలో ప్రతిపక్షాల అభ్యంతరాలను పట్టించుకోకుండా నిరంకుశంగా ముందుకు వెళ్లినా, విభేదాలను పక్కనపెట్టి ప్రారంభోత్సవానికి హాజరుకావాలని భావించామని, అయితే చివరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సైతం పక్కకు పెట్టి, ప్రధాని మోదీ తానే పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించాలనుకోవడం సహించరాని చర్య. ఇది రాష్ట్రపతిని అవమానించడమే కాకుండా, నేరుగా మన దేశ ప్రజాస్వామ్యంపై జరిపిన దాడిగా భావిస్తున్నాం’ అని విపక్షాలు పేర్కొన్నాయి.

కాగా పార్లమెంట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించిన పార్టీలలో.. కాంగ్రెస్‌, టీఎంసీ, డీఎంకే, జేడీయూ, ఆప్‌, సీపీఎం, సీపీఐ, ఎస్పీ, ఎన్సీపీ, శివసేన(యూబీటీ), ఆర్జేడీ, ఐయూఎంఎల్‌, జేఎంఎం, ఎన్‌సీ, కేసీ(ఎం), ఆర్‌ఎస్పీ, వీసీకే, ఎండీఎంకే, ఆరెల్డీ ఉన్నాయి. ఇక కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవం జరుగనున్న మే 28, బీజేపీ ఆరాధ్యనీయుడైన వీర సావర్కర్‌ జయంతి రోజు కావడం గమనార్హం. అయితే ఇది మోదీ సర్కార్ ఇది ఉద్దేశపూర్వకంగా కావాలనే చేస్తున్నదా? లేక యాదృచ్ఛికమా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. స్వతంత్ర భారతానికి చిహ్నమైన పార్లమెంట్‌ భవనాన్ని బ్రిటీష్‌ ప్రభుత్వం వద్ద క్షమాభిక్ష కోరుకొన్నారని ఆరోపించబడుతున్న సావర్కర్‌ పుట్టిన రోజున ప్రారంభించడం, దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరులను అవమానించడమేనని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉండగా.. మరోవైపు ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్ష టీడీపీలు పార్లమెంట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. కాగా సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ దీనిపై ఈరోజు తన నిర్ణయాన్ని ప్రకటించనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =