గన్నవరం ఘటనపై స్పందించిన మాజీ మంత్రి కొడాలి నాని.. టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు

AP Ex Minister Kodali Nani Sensational Comments on TDP Chief Chandrababu Over Gannavaram Incident, AP Ex Minister Kodali Nani, Kodali Nani Sensational Comments,Chief Chandrababu Over Gannavaram Incident,Mango News,Mango News Telugu,Gannavaram Live Updates,Kodali Nani Daughters,Kodali Nani Education Qualification,Kodali Nani Family,Kodali Nani Phone Number,Kodali Nani Wife,Tdp Andhra Pradesh President,Tdp Chief Chandrababu Naidu,Tdp Chief N Chandrababu Naidu,Tdp Finance Minister,Tdp Leaders List

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గన్నవరం ఘర్షణల ఘటనపై రాష్ట్ర మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. గురువారం దీనిపై మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఏపీలో సామజిక విప్లవానికి తెరతీశారని, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఇది రుజువైందని పేర్కొన్నారు. త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రాధాన్యత ఇచ్చారని, నాడు ఎన్టీఆర్, వైఎస్సార్ తర్వాత ఆయా వర్గాల వారికి గుర్తింపు ఇచ్చింది సీఎం జగనే అని వ్యాఖ్యానించారు. దీంతో రోజురోజుకీ ప్రజల్లో జగన్ పరపతి పెరుగుతుండటాన్ని చూసి సహించలేక, దీనిని అడ్డుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు తన అనుకూల మీడియాతో కలిసి కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు.

దీనిలో భాగంగానే పట్టాభిని గన్నవరం పంపించి గొడవలు సృష్టించడానికి చంద్రబాబు ప్రయత్నించారని, అందుకే పట్టాభి వైసీపీ శ్రేణులను కావాలనే రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ముందుగా సిద్ధం చేసుకున్న కర్రలు, రాళ్లతో వైసీపీ కార్యకర్తలాతో సహా పోలీసులపైన కూడా దాడులు చేశారని, ఈ ఘటనలో సీఐ తలకు తీవ్ర గాయమై ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. తమ పార్టీ కార్యకర్తలపై చంద్రబాబుకు అంత ప్రేమ ఉంటే గన్నవరం వచ్చి గాయపడ్డవారిని ఎందుకు పరామర్శించలేదు? అని ఆయన ప్రశ్నించారు. ఈ గొడవలకు కారణమైన పట్టాభిని అరెస్ట్ చేయడంలో తప్పేముందన్న కొడాలి నాని.. చంద్రబాబు అనుకూల మీడియాలో పట్టాభిని పోలీసులు కొట్టారని పాత ఫొటోలతో అసత్య వార్తలు రాయిస్తున్నారని మండిపడ్డారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + twelve =