ఎపిసోడ్ 9 (జూలై29) హైలైట్స్: ఇంటిలోకి తమన్నా సింహాద్రి ఎంట్రీ, నామినేషన్ ప్రక్రియ

Akkineni Nagarjuna, Bigg Boss, Bigg Boss Episode 9, Bigg Boss Season 3 Telugu, Bigg Boss Season 3 Telugu Episode 9 Highlights, Bigg Boss Telugu, Bigg Boss Telugu 3, Bigg Boss Telugu 3 Highlights, Bigg Boss Telugu 3 Latest, Hema Elemination, Highlights Of Bigg Boss Telugu 3, Highlights Of Bigg Boss Telugu 3 Episode 9, Mango News Telugu, Tammanah Simhadri, Tammanah Simhadri Entry

గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో 15 మంది సభ్యులు బిగ్ బాస్ ఇంటిలోకి ఎంటరయ్యారు. ఆదివారం నాటి ఎపిసోడ్ లో హేమ ఎలిమినేట్ అయ్యింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తమన్నా సింహాద్రి అనే ట్రాన్స్‌జెండర్ బిగ్ బాస్ హౌస్ లోకి రావడంతో మళ్ళీ ఇంటిలో 15 మంది సభ్యులు ఉన్నారు. జులై 29న ప్రసారమైన బిగ్ బాస్ 3 తొమ్మిదో ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ కొనసాగింది.

ఎపిసోడ్ 9 (జూలై29) హైలైట్స్: ఇంటిలోకి తమన్నా సింహాద్రి ఎంట్రీ, నామినేషన్ ప్రక్రియ

  • ఇంటి సభ్యులు ఈ వారం జరిగే నామినేషన్ పక్రియ గురించి మాట్లాడుకుంటున్నారు
  • తమన్నా సింహాద్రి బిగ్ బాస్ ఇంటిలోకి రాగానే సభ్యులంతా ఆశర్యపోయారు
  • ఇంటిలోకి వచ్చిన తమన్నా సింహాద్రి బాబాబాస్కర్,జాఫర్ టీంతో ఉంటానని చెప్పింది
  • మహేష్ విట్టాతో వరుణ్-వితికా ప్రవర్తించిన తీరు తనకు నచ్చలేదని తమన్నా సింహాద్రి ఇంటి సభ్యులతో చెప్పింది
  • ఈ వారం ఎలిమినేషన్ కొరకు, ఒక్కొక్క సభ్యున్ని కన్ఫెషన్ రూంలోకి పిలిచి ఇద్దరు సభ్యులని నామినేట్ చేయవలసిందిగా కోరారు,ఈ రోజే వచ్చినందువలన తమన్నా సింహాద్రిని నామినేషన్స్ నుండి మినహాయించారు. నామినేషన్స్ గురించి చర్చించకూడదు అని చెప్పిన, వితికా చర్చించడంతో ఆమెను బిగ్ బాస్ ఈ వారం నామినేషన్ చేయడానికి అనర్హురాలిగా ప్రకటించారు.

 నామినేషన్స్ ఈ విధముగా కొనసాగాయి:

  • హిమజ – పునర్నవి, రాహుల్ ని నామినేట్ చేసింది
  • వరుణ్ – జాఫర్, శ్రీముఖి లను నామినేట్ చేసాడు
  • అషు రెడ్డి – శ్రీముఖి, రాహుల్ లని నామినేట్ చేసింది
  • సింగర్ రాహుల్ – హిమజ, శ్రీముఖి లను నామినేట్ చేసాడు
  • సావిత్రి – శ్రీముఖి,జాఫర్ లని నామినేట్ చేసింది
  • అలీ రజా – హిమజ, వరుణ్ సందేశ్ లను నామినేట్ చేసాడు
  • రవిక్రిష్ణ -హిమజ,జాఫర్ లను నామినేట్ చేసాడు
  • జాఫర్ – వితికా, మహేష్ లను నామినేట్ చేసాడు
  • రోహిణి – వితికా, మహేష్ లని నామినేట్ చేసింది
  • మహేష్ – వితికా, వరుణ్ సందేశ్ లను నామినేట్ చేసాడు
  • శ్రీముఖి – హిమజ, మహేష్ విట్టా లని నామినేట్ చేసింది
  • పునర్నవి – హిమజ, శ్రీముఖి లని నామినేట్ చేసింది
  • తమన్నా సింహాద్రి – వరుణ్ సందేష్, వితికా లని నామినేట్ చేసింది
  • బాబా భాస్కర్ – వితికా, రాహుల్‌ లను నామినేట్ చేసాడు
  • అయితే వచ్చి వారమే అవుతుంది,ఎదో ఒక కారణంతో ఎవరిని నామినేట్ చేయలేను కావాలంటే తనను నామినేట్ చేయాలంటూ బాబా భాస్కర్ బిగ్ బాస్ ను కోరాడు. అలా కుదరదని ప్రతివారం ఎవరో ఒకరిని నామినేట్ చెయ్యాలని, ఎవరి పేరు చెప్పకపోతే ఇంటి సభ్యులందరూ నామినేట్ చేయబడుతారని మళ్ళీ ఆలోచించుకుని చెప్పాలని బిగ్ బాస్ బాబా భాస్కర్ ని కోరతాడు. ఎట్టకేలకు తరువాత బాబా భాస్కర్ వితికా, రాహుల్‌ లను నామినేట్ చేసాడు
  • ఈ వారం ఎలిమినేషన్ కు మొత్తం 8 మంది సభ్యులు నామినేట్ అయ్యారు. వారిలో శ్రీముఖి, రాహుల్, వితికా, వరుణ్ సందేశ్, హిమజ, మహేష్, జాఫర్, పునర్నవి ఉన్నారు. ఎక్కువమంది వితికా, శ్రీముఖి, హిమజ పేర్లను చెప్పారు
  • ఎలిమినేషన్ ప్రక్రియపై సభ్యులు మాట్లాడుకుంటుండగా ఈ ఎపిసోడ్ ముగిసింది, తరువాత ఎపిసోడ్లో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు శిక్ష విధించినట్టు ఉన్నాడు, పూర్తీ వివరాల కోసం ఈ రోజు ఎపిసోడ్ కోసం ఎదురుచూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =