వైఎస్ షర్మిలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన అంబటి

Ambati, YS Sharmila, Ambati made harsh comments on YS Sharmila, Ambati Rambabu, YS Sharmila, Congress VS YCP, AP Politics, Minister Roja, Lakshminarayana, cricketer Ambati Rayudu, AP Politics, AP Elections, Mango News Telugu, Mango News
Ambati Rambabu, YS Sharmila, Congress VS YCP, AP Politics

ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేజిక్కించుకున్న వైఎస్ షర్మిల దూకుడుగా ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా వైసీపీని టార్గెట్‌గా చేసుకొని విమర్శనాస్త్రాలు వదులుతున్నారు. ఒకప్పుడు తెలంగాణలో విమర్శలతో కేసీఆర్ సర్కార్‌కు తూట్లు పొడిచిన షర్మిల.. ఇప్పుడు ఏపీలో వైసీపీ సర్కార్‌కు తూట్లు పొడుస్తున్నారు. అన్న జగన్‌తో పాటు వైసీపీ నేతలపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇటీవల గుండ్లకమ్మ ప్రాజెక్టును పరిశీలించిన షర్మిల.. నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైపు గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు నీటిలో తేలుతుంటే.. సంబంధిత శాఖ మంత్రి మాత్రం సంక్రాంతి సంబురాల్లో మునిగి తేలుతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు.

అయితే షర్మిల వ్యాఖ్యలపై అంతే ఘాటుగా అంబటి రాంబాబు స్పందించారు. షర్మిలపై భగ్గుమన్నారు. పిచ్చిపిల్ల షర్మిల ఓవర్ యాక్షన్ చేస్తోందంటూ రాంబాబు వ్యాఖ్యానించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె కాస్త ఓవర్ యాక్షన్ చేస్తోందని అన్నారు. అదే సమయంలో రాజకీయాల్లో స్వేచ్ఛ ఉంటుందన్న అంబటి.. షర్మిల ఓవర్ యాక్షన్  చేసినా తమకేం నష్టం లేదని వ్యాఖ్యానించారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వైసీపీ గెలుపును అడ్డుకోలేరని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

మరోవైపు వైసీపీ నేతలపై షర్మిల చేస్తోన్న వ్యాఖ్యలపై మొదటిసారి మంత్రి రోజా స్పందించారు. షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రాల్లో ఉంటున్నవారు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి మాట్లాడుతున్నారని భగ్గుమన్నారు. అసలు షర్మిల మాట్లాడుతున్న మాటలకు విలువేలేదని విమర్శించారు. షర్మిల కాంగ్రెస్ వేషం వేసుకున్నప్పటికీ.. ఆమె చదివే స్క్రిప్ట్ మాత్రం తెలుగు దేశం పార్టీదని సెటైరికల్‌గా వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు నాలుగో కృష్ణుడిని తీసుకొచ్చారని ఆరోపించారు. వైసీపీపై బురదజల్లే ప్రయత్నం చేసినా.. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రోజా చెప్పుకొచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =