గుజరాత్, హిమాచల్ ఎన్నికలకు పరిశీలకులను ప్రకటించిన కాంగ్రెస్.. అశోక్ గెహ్లాట్, భూపేష్ బాఘేల్‌ నియామకం

Congress Appoints Ashok Gehlot Bhupesh Baghel as Senior Observers For Gujarat and Himachal polls, Congress Appoints Bhupesh Baghel as Senior Observers For Gujarat and Himachal polls, Congress Appoints Ashok Gehlot as Senior Observers For Gujarat and Himachal polls, Senior Observers For Gujarat and Himachal polls, Gujarat and Himachal polls Senior Observers, Gujarat and Himachal polls, Himachal polls, Gujarat polls, Indian National Congress, Congress, Senior Observers, Bhupesh Baghel, Ashok Gehlot, Gujarat and Himachal polls News, Gujarat and Himachal polls Latest News, Gujarat and Himachal polls Latest Updates, Gujarat and Himachal polls Live Updates, Mango News, Mango News Telugu,

ఈ ఏడాది చివ‌రిలో జ‌రుగనున్న గుజ‌రాత్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై కాంగ్రెస్ ఇప్పటినుంచే దృష్టి పెట్టింది. బీజేపీ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రాల్లో అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పాలిట రాష్ట్రాల ముఖ్యమంత్రులను రంగంలోకి దించుతోంది. ఈ క్రమంలో గుజరాత్, హిమాచల్ ఎన్నికలకు సీనియర్ పరిశీలకులుగా అశోక్ గెహ్లాట్, భూపేష్ బాఘేల్‌ను కాంగ్రెస్ నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సీనియర్ పరిశీలకుడిగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను నియమించారు. అదేవిధంగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సీనియర్ పరిశీలకుడిగా నియమితులయ్యారు. ఇక పార్టీలోని కీలక నేతలైన గుజరాత్ ఎన్నికలకు టిఎస్ సింగ్ డియో, మిలింద్ దేవరాలను పరిశీలకులుగా నియమించగా, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సచిన్ పైలట్, పర్తాప్ సింగ్ బజ్వా పరిశీలకులుగా ఉంటారని విడుదల చేసిన ప్రకటనలో పార్టీ పేర్కొంది. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం కానున్నాయి. మరో రెండేళ్లలో కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఎక్కువ రాష్ట్రాల్లో అధికారం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకునే ఈ రెండు రాష్ట్రాలలో పాగా వేయడానికి ఈ సీనియర్ నాయకులను నియమించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 6 =