ఏపీలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీపై కసరత్తు, అర్బన్ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తూ నిర్ణయం

AP Govt Has Set Up Urban Task Force Over Distribution of Covid-19 Vaccine,AP Govt Sets Up Urban Task Force For Distribution Of Coronavirus Vaccine,AP Govt Issues Orders,Mango News,Mango News Telugu,Coronavirus Vaccine,Union Health Minister Harsh Vardhan,Urban Task Force,Andhra Pradesh Government,AP Govt Has Issued Orders Setting Up An Urban Task Force,AP Govt To Conduct The Covid Vaccine Distribution Exercise In Urban Areas,Urban Task,Covid Vaccine Distribution,Distribution of Covid-19 Vaccine,AP Govt Set Up Urban Task Force For Distribution Of Covid-19 Vaccine,Coronavirus Vaccine,Task Force,Government Of Andhra Pradesh,Amaravati

దేశంలో వివిధ ఫార్మా సంస్థలు తయారుచేస్తున్న కరోనా వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ చివరి దశకు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినపుడు ప్రజలకు పంపిణీ చేసే అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం, వ్యాక్సిన్ పంపిణీ కసరత్తు కోసం తాజాగా అర్బన్ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ అర్బన్ టాస్క్‌ఫోర్స్ కు మున్సిపల్‌శాఖ కమిషనర్‌ ఛైర్మన్‌గా వ్యవరించనున్నారు. అలాగే ఈ కమిటీలో మొత్తం 9 మంది సభ్యులు ఉండనున్నారు.

మరోవైపు రాష్ట్ర, జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీల్లో కూడా ప్రభుత్వం సవరణలు చేసింది. రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ లో మరో ఆరుగురు సభ్యులకు స్థానం కల్పించడంతో మొత్తం సభ్యుల సంఖ్య 16 కు చేరింది. అలాగే జిల్లా టాస్క్‌ఫోర్స్‌లో మరో 31 మంది అధికారులను సభ్యులుగా చేర్చడంతో జిల్లా టాస్క్‌ఫోర్స్‌ లో సభ్యుల సంఖ్య 34 కు చేరింది. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రణాళిక రూపకల్పన, అమలులో ఈ కమిటీలు కీలకంగా పనిచేయనున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =