రైతులు, మహిళలు టార్గెట్‌గా కొత్త పథకాలు

YCP Manifesto Is Ready, YCP Manifesto, YCP Manifesto, Congress, YCP, Modi, Jagan government, Pawan kalyan, NDA, YCP, TDP, Janasena, Chandra Babu, BJP, Mango News, Mango News Telugu
YCP Manifesto,Congress, YCP, Modi, Jagan's government, pawan kalyan, NDA, YCP, TDP, janasena, Chandra babu, BJP,

వైఎస్సార్సీపీ మేనిఫెస్టో రూపకల్పన ఫైనల్ దశకు చేరుకున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. మార్చి  20న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తారని వెల్లడించారు. ఈ మేనిఫెస్టోలో రైతులు, మహిళలు టార్గెట్‌గా కొత్త పథకాలు ఉండనున్నట్లు తెలుస్తోంది.  గత ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నిటినీ నెరవెర్చేమని .. ఇప్పుడు కూడా నెరవేర్చగల హామీలను మాత్రమే తాము ఇస్తామని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు.

తాజాగా  175 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాల కోసం ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు. దీనికి తోడు అదే రోజు ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడటంతో ప్రచారం ప్రారంభించడానికి  వైఎస్సార్సీపీ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. తాజాగా మేదరమెట్లలో జరిగిన సిద్ధం సభలో మేనిఫెస్టోపై మాట్లాడిన  సీఎం.. 2024 ఎన్నికల్లో కూడా తాము  అధికారంలోకి   వచ్చిన తర్వాత పేదలు, రైతులు, మహిళలు,   విద్యార్థులతో పాటు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి  కట్టుబడి ఉంటామని వివరించారు. మేనిఫెస్టోను తాము పవిత్ర గ్రంథంగా పరిగణిస్తామని.. 2019 ఎన్నికల ముందు వైసీపీ ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చినట్లు గర్వంగా చెప్పుకుంటున్నామని అన్నారు.

మరోవైపు తమ పార్టీ అభ్యర్థుల ఖరారులో వైఎస్సార్సీపీ పక్కాగా సోషల్ ఇంజనీరింగ్ చేసినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో ఓసీలకు 84, బీసీలకు 48, ఎస్సీ 10, ఎస్టీలకు 33 సీట్లు, మైనార్టీలకు 7 సీట్లు కేటాయిస్తూ ఓసీలకు కాస్త ఎక్కువ సీట్లే ఇచ్చింది. మరోవైపు లోక్ సభ అభ్యర్థుల విషయంలో కూడా అదే ఫార్మాట్ ను ఫాలో అయినట్లు తెలుస్తోంది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలలో బీసీలకు 11, ఎస్సీలకు 4, ఎస్టీ 1, ఓసీలకు 9 సీట్లు ఇచ్చింది.

ఈ స్థానాలలో వైఎస్సార్సీపీ  5 ఎంపీ సీట్లను మహిళలకు కేటాయించింది. 2019 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 7 ఎమ్మెల్యే సీట్లను అదనంగా ఇచ్చినట్లయింది . ఆంధ్రప్రదేశ్‌లో 25 ఎంపీ స్థానాలు ఉంటే.. 24 స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రకటించారు. అనకాపల్లి సీటును మాత్రం బీసీలకు ఇస్తున్నట్లు చెప్పిన వైసీపీ..అభ్యర్థి ఎవరనేది తేల్చకుండా సస్పెన్స్‌లోనే ఉంచింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + nineteen =