ఏపీలో సినిమా టికెట్ల బుకింగ్ కోసం ప్రభుత్వ పోర్టల్ ఏర్పాటుపై ఉత్తర్వులు

Andhra Pradesh govt to sell movie tickets online, AP government to take up cinema tickets booking, AP Govt Issued Orders on Online Ticket Booking System, AP Govt Issued Orders on Online Ticket Booking System for Single Theatres and Multiplexes in the State, AP govt to sell cinema tickets online, AP Online Ticket Booking System, Jagan Govt To Launch A Movie Ticket Booking Portal, Mango News, Online Ticket Booking System, Online Ticket Booking System for Single Theatres and Multiplexes, Online Ticket Booking System In AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల బుకింగ్ విషయంలో ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ పోర్టల్/ వెబ్‌సెట్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. రైల్వే ఆన్‌లైన్ టికెటింగ్ సిస్టం తరహాలో రాష్ట్రంలోని సింగిల్ థియేటర్స్ మరియు మల్టీఫ్లెక్స్ లలో సినిమా టికెట్ల బుకింగ్ కోసం పోర్టల్ ను రూపొందించబోతున్నట్టు తెలిపారు. ఈ సినిమా ఆన్‌లైన్ టికెటింగ్ సిస్టంను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్లూ ప్రింట్, అభివృద్ధి, అమలు పక్రియ కోసం ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ మేరకు జీవో నెం.782ను బుధవారం ప్రభుత్వం విడుదల చేసింది.

కమిటీలో సభ్యులు:

  • హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ – చైర్మన్‌
  • ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ – కోచైర్మన్‌
  • ఐ అండ్ పీఆర్, ఏపీఎఫ్‌టీడీసీ సెక్రటరీ – మెంబర్
  • కమర్షియల్ టాక్స్ రిప్రెజెంటేటివ్ ఆఫ్ కమిషనర్ – మెంబర్
  • ఏపీటీఎస్ ఎండీ – మెంబర్
  • కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) – మెంబర్
  • గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) – మెంబర్
  • ఐటీ శాఖ స్పెషల్ సెక్రటరీ – మెంబర్
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =