వచ్చే ఏడాది 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, ఇన్‌చార్జిలు, కో-ఇన్‌చార్జిలను నియమించిన బీజేపీ

Assembly Polls, BJP Announces Election In-charges, BJP Announces Election In-charges For 2022 Assembly Polls, BJP Announces State In-charges, BJP Announces State In-charges for Five Poll-Bound States, BJP appoints election in-charges for poll-bound states, BJP focus on caste in appointing poll-bound states in-charges, BJP poll-bound states in-charges, five union ministers to steer preparations in Uttar Pradesh, Mango News, poll-bound states in-charges

వచ్చే ఏడాదిలో ఉత్తర్ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌, పంజాబ్‌ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌చార్జిలను, కో-ఇన్‌చార్జిలను బీజేపీ బుధవారం నాడు ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే 5 రాష్ట్రాలకు ఇన్‌చార్జిలను నియమిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయం తీసుకున్నారు.

ఉత్తర్ ప్రదేశ్‌:

  • ఎన్నికల ఇన్‌చార్జ్: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌
  • కో-ఇన్‌చార్జిలు: కేంద్రమంత్రులు అనురాగ్ సింగ్ ఠాకూర్, అర్జున్ రామ్ మేఘ్వాల్, శోభా కరంద్లాజే, అన్నపూర్ణ దేవి, హర్యానా రాష్ట్ర మాజీ మంత్రి కెప్టెన్ అభిమన్యు, రాజ్యసభ ఎంపీ సరోజ్ పాండే, రాజ్యసభ ఎంపీ వివేక్ ఠాకూర్.

ఉత్తరాఖండ్‌:

  • ఎన్నికల ఇన్‌చార్జ్ : పార్లమెంటరీ వ్యవహారాల కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
  • కో-ఇన్‌చార్జిలు: లోక్ సభ ఎంపీ లాకెట్ ఛటర్జీ, పార్టీ అధికార ప్రతినిధి ఆర్పి సింగ్

పంజాబ్‌ :

  • ఎన్నికల ఇన్‌చార్జ్ : కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్
  • కో-ఇన్‌చార్జిలు: కేంద్రమంత్రులు హార్దిప్ పూరి, మీనాక్షి లేఖి మరియు లోక్ సభ ఎంపీ వినోద్ చావ్డా

మణిపూర్‌:

  • ఎన్నికల ఇన్‌చార్జ్ : కేంద్ర పర్యావరణం, అడవులు మరియు క్లైమేట్ చేంజ్ మంత్రి భూపేందర్ యాదవ్
  • కో-ఇన్‌చార్జిలు: కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్ మరియు అస్సాం మంత్రి అశోక్ సింఘాల్

గోవా :

  • ఎన్నికల ఇన్‌చార్జ్ : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్
  • కో-ఇన్‌చార్జిలు: కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, దర్శన జర్దోష్
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =