ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, 292 ఉన్నత పాఠశాలలు హైస్కూల్​ ప్లస్​గా అప్​గ్రేడ్

AP Govt Issues Orders to Upgrade 292 High Schools in the State to High School Plus Schools, Govt Issues Orders to Upgrade 292 High Schools in the State to High School Plus Schools, High Schools in the State to High School Plus Schools, Upgrade 292 High Schools in the State to High School Plus Schools, High School Plus Schools, 292 High Schools, high school plus, government issued an order to convert 292 high schools across the state of Andhra Pradesh into high school plus, AP High Schools Upgrade, AP Schools rationalization, Up-gradation of 292 Government High Schools, 292 Government High Schools, Upgradation of existing 292 Government High Schools, AP High Schools Upgrade News, AP High Schools Upgrade Latest News, AP High Schools Upgrade Latest Updates, AP High Schools Upgrade Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 292 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్​గా అప్​గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలలను బాలికలకు ప్రత్యేకంగా కేటాయిస్తునట్టు పేర్కొన్నారు. అలాగే వీటిల్లోఎంపీసీ, బైపీసీ, సీఈసీలలో రెండు కోర్సులు మాత్రమే అందించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలల్లో స్థానికంగా ఉన్న డిమాండ్​ను అనుసరించి కోర్సులు నిర్ధారించాలని నిర్ణయించారు. అదేవిధంగా వీటిల్లో పీజీటీ సమాన స్థాయి అధ్యాపకులనే విద్యా బోధనకు తీసుకోనున్నట్టు తెలిపారు.

మొత్తం 1752 స్కూల్ అసిస్టెంట్​ లను 292 హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలల్లో పని చేసేందుకు నియమిస్తామని చెప్పారు. ఇక ఆయా పాఠశాలల్లో ఇప్పటికే నాడు- నేడు పనులు చేపట్టిన దృష్ట్యా, అదనపు తరగతి గదులను మంజూరు చేయబోమని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న అంగన్‌వాడీ సెంటర్లు, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మండల, జిల్లా పరిషత్‌ స్కూళ్లు, మున్సిపల్, ట్రైబల్‌ వెల్ఫేర్ స్కూళ్లను సంస్కరణల్లో భాగంగా పాఠశాలలను ఆరు రకాలుగా వర్గీకరణ చేసిన విషయం తెలిసిందే. శాటిలైట్‌ ఫౌండేషన్, ఫౌండేషనల్‌, ఫౌండేషన్‌ ప్లస్, ప్రీ హైస్కూలు, హైస్కూల్, హైస్కూల్‌ ప్లస్‌ వంటి ఆరు అంచెల విధానాన్ని పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. అందులో భాగంగా హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలల్లో 3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యాబోధన చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 3 =