పులివెందులలో త్రిముఖపోరు?.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్

Jagan,fight Pulivendula fight, YS Jagan, Sharmila, BTech Ravi, Chandrababu, Pawan Kalyan, Vijayamma, Pulivendula,Andhra Pradesh News Updates, AP Political News, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
Jagan,fight Pulivendula fight, YS Jagan, Sharmila, BTech Ravi, Chandrababu, Pawan Kalyan, Vijayamma, Pulivendula

పులివెందులలో రాబోయే ఎన్నికలలో  త్రిముఖ పోరు తప్పదన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాను రెండు పార్టీల అధినేతలు తొలి జాబితా విడుదల చేయడంతో ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయబోతున్నారనే దానిపై దాదాపు  క్లారిటీ వచ్చింది.ముఖ్యంగా కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో సీఎం  జగన్ మోహన్ రెడ్డికి  పోటీగా.. బీటెక్ రవిని బరిలో దించబోతున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అలాగే మరోవైపు జగనన్నకు పోటీగా.. కాంగ్రెస్ తరుపున వైఎస్ షర్మిల కూడా పులివెందుల నుంచే బరిలో దిగబోతున్నట్లు ఏపీ రాజకీయ సర్కిల్‌లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమయ్యి.. నిజంగానే  షర్మిల పులివెందుల ప్రజా క్షేత్రంలో నిలిస్తే.. జగన్ మోహన్ రెడ్డి భారీ షాక్ తప్పదన్న వాదన వినిపిస్తోంది.

కొన్నేళ్లుగా పులివెందుల నియోజక వర్గం వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వస్తోందన్న విషయం తెలిసింది. అయితే గత ఎన్నికల వరకూ ఒక లెక్క ఇప్పుడో లెక్క అన్నట్లు వైఎస్సార్ కుటుంబంలో జరిగిన చీలిక.. ఇప్పుడు పులివెందుల ప్రజలను రెండు వర్గాలుగా మారిపోయాయి. ఎందుకంటే  రెండేళ్ల నుంచీ  వైఎస్ కుటుంబంలో అన్న జగన్‌కు, చెల్లెలు షర్మిలకు మధ్య విభేదాలు చెలరేగుతూ వచ్చాయి. దీనికి తోడు కూతురు వెంటే విజయమ్మ వెళ్లడం, బాబాయ్ కూతురు సునీత కూడా జగన్‌కు యాంటీగా ఉండటం కచ్చితంగా జగన్ గెలుపునకు మైనస్‌లే అవుతాయి.

ఇటు అన్నతో విభేదాల వల్ల షర్మిల ఏపీ రాజకీయాలు విడిచి తెలంగాణలో పార్టీ పెట్టడం..మళ్లీ ఆ  పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఇప్పుడు ఏపీ అధ్యక్ష బాధ్యతలో ఉండటం వంటి రాజకీయ పరిణామాలు చాలానే జరిగాయి. అంతేకాదు ఏపీలోకి రాగానే   వైఎస్ జగన్ పాలనపై షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతూ వైసీపీ పాలనను ఎండగడుతున్నారు. ఈ పరిస్థితులను చూసి .. జగన్ కు పోటీగా  కాంగ్రెస్ తరుపున షర్మిలను  పులివెందుల నుంచి పోటీ చేయించడానికి అధిష్టానం రెడీ అవుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల గెలవడం కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం కాబట్టి..మొదటి నుంచీ వైఎస్ కుటుంబానికి వెన్నుదన్నుగా..ఇంకా చెప్పాలంటే  అడ్డాగా ఉన్న పులివెందులలో నిలబడటమే కరెక్ట్ అన్న ఆలోచనలో ఇటు కాంగ్రెస్ అంటు షర్మిలలో ఉన్నట్లు తెలుస్తోంది.  షర్మిల  నిజంగానే పులివెందుల బరిలో నిలిస్తే.. మాత్రం త్రిముఖ పోటీ రవసత్తరంగా మారుతుందని విశ్లేషకులు అంటున్నారు. అన్నా చెల్లెళ్ల మధ్య జరిగే పొలిటికల్  బిగ్ ఫైట్ లో ఓట్ల చీలిక భారీగా ఏర్పడే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే వీరిద్దరి మధ్య జరిగే పొలిటికల్ ఫైట్ అటు టీడీపీ అభ్యర్థి అయిన బీటెక్ రవికి ప్లస్ అయినా కూడా  ఆశ్చర్యపోనక్కరలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 5 =