ఏపీకి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తేవడంపై నిషేధం, జీవో విడుదల

AP Govt, AP Govt Releases New GO over Liquor Transport, AP Liquor Transport, AP Liquor Transport News, AP New GO over Liquor Transport, AP New GO over Liquor Transport from Other States, New GO over Liquor Transport, New GO over Liquor Transport from Other States, New GO over Liquor Transport from Other States In AP, New GO over Liquor Transport In AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందు ప్రియులకు మరో షాక్‌ తగిలింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిల్స్ తీసుకురావడాన్ని నిషేధిస్తూ తాజాగా ఏపీ‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్మిట్లు/లైసెన్స్‌ లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి మద్యం తేవడాన్ని నిషేధిస్తూ సోమవారం నాడు జీవో నెంబర్ 310ని ఏపీ ఎక్సైజ్ శాఖ విడుదల చేసింది. దీంతో ఇంతకు ముందులా ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిల్స్‌ తెచ్చుకునే అనుమతి కూడా రద్దు కానుంది. పర్మిట్ లేకుండా రాష్ట్రానికి మద్యం తీసుకొస్తే ఏపీ ఎక్సైజ్ చట్టం ద్వారా శిక్షకు అర్హులు అవుతారని పేర్కొన్నారు.

మరోవైపు ఇతర దేశాల వచ్చేప్పుడు నుంచి మద్యం తెచ్చుకునే అంశంపై కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతి ఉంటుందని తెలిపారు. మద్యం అక్రమ రవాణా అరికట్టడం, ప్రజల ఆరోగ్యం దృష్ట్యానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునట్టు తెలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలులో భాగంగా మద్యం దుకాణాలను, బార్ల సంఖ్యను తగ్గించుకుంటు వస్తున్న సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =