ఏయూలో అమెరికన్‌ కార్నర్‌ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

American Corner, American Corner Center in Andhra University, Andhra University, AP CM Jagan Live, AP CM YS Jagan, AP CM YS Jagan Launches American Corner, AP CM YS Jagan Launches American Corner Center, AP CM YS Jagan Launches American Corner Center in Andhra University, AP CM YS Jagan Launches American Corner In Vizag, CM Jagan to virtually launch American Corner, CM Jagan virtually launch American Corner, First American corner in Andhra Pradesh, Jagan to virtually launch American Corner in Andhra, Mango News, YS Jagan launches American Corner set up

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం ఉదయం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానం ద్వారా ‘అమెరికన్‌ కార్నర్‌’ కేంద్రాన్ని ప్రారంభించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ)లో ఈ ‘అమెరికన్‌ కార్నర్‌’ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మెన్, యూఎస్‌ ఎయిడ్‌ ఇండియా డైరెక్టర్‌ వీణా రెడ్డి, ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ, ఆంధ్ర యూనివర్సిటీలో అమెరికన్‌ కార్నర్‌ ఏర్పాటు కావటం సంతోషంగా ఉందని అన్నారు. ఇది దేశంలో ఏర్పాటైన మూడో అమెరికన్‌ కార్నర్‌ అని, ఇంతకుముందు అహ్మదాబాద్‌, హైదరాబాద్‌ లో ఉన్నాయన్నారు. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నానని తెలిపారు. అమెరికాలో విద్య, ఉద్యోగావకాశాల సమాచారానికి సంబంధించి సేవలను అమెరికన్‌ కార్నర్‌ అందించనుంది. వచ్చే 8 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 6 టీచర్ ట్రైనింగ్ వర్క్ షాప్స్, లెర్న్ ఇంగ్లీష్, రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్ వంటి పలు అంశాలపై కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =