ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, శాసనమండలి రద్దు తీర్మానం ఉపసంహరణ

Andhra Pradesh Assembly, AP Assembly key decisions, AP Assembly session, AP Assembly Session 2021, AP Assembly Session Highlights, AP Govt Withdraws Resolution of Dissolving the Legislative Council, AP Govt Withdraws Resolution of Dissolving the Legislative Council in the Assembly, AP Legislative Council, AP Withdraws Resolution of Dissolving the Legislative Council, Dissolving the Legislative Council, Govt Withdraws Resolution of Dissolving the Legislative Council in the AP Assembly, Legislative Council, Mango News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిని రద్దు చేస్తూ గతంలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఈ మేరకు మండలి రద్దు ఉపసంహరణ తీర్మానాన్ని ఆయన సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ, ఆ రోజు పరిస్థితులను బట్టి జనవరి 27, 2020న కౌన్సిల్ ను రద్దు చేస్తూ సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని చెప్పారు. అయితే ఇంత సమయమైనప్పటికీ వివిధ కారణాల వలన ఎలాంటి ప్రోగ్రెస్ లేకుండా కేంద్రం వద్దనే ఉందన్నారు. మండలి రద్దు నిర్ణయం తర్వాత సందిగ్ధత నెలకొందని చెప్పారు. దీంతో సందిగ్ధతను తొలగించేందుకు మళ్ళీ మండలిని తిరిగి కొనసాగించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

పాత సభ్యులతో పాటుగా, కొత్త సభ్యులతో కూడిన మండలి ద్వారా, శాసనసభలో తీసుకునే నిర్ణయాలకు మద్దతు కోరుకుంటూ, సలహాలు, సూచనలు పొందేలా, అనవసర వ్యతిరేకతకు అవకాశం లేకుండా ముందుకెళ్లాలని కోరుకుంటూ శాసనమండలిని అదేవిధంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. మంత్రి వివరణ అనంతరం మండలి రద్దు ఉపసంహరణ తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 18 =