నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్

Kalvakuntla Kavitha, Kalvakuntla Kavitha Files Nomination as TRS Candidate, Kalvakuntla Kavitha Files Nomination as TRS Candidate for MLC Post, Kalvakuntla Kavitha Files Nomination as TRS Candidate for MLC Post of Nizamabad Local Bodies, Kavitha 11 others named as MLC candidates, Kavitha files nomination for MLC post, Mango News, MLC Post of Nizamabad Local Bodies, TRS Candidate for MLC Post of Nizamabad Local Bodies, TRS leader Kalvakuntla Kavitha, TRS leader Kalvakuntla Kavitha files nomination, TRS leader Kalvakuntla Kavitha files nomination for Nizamabad MLC

నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు డిసెంబర్ 10వ తేదీన పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఖరారు చేస్తూ టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం నిజామాబాద్‌లో కవిత నామినేషన్‌ దాఖలు చేశారు. జిల్లా కలెక్టర్ అండ్ రిటర్నింగ్ అధికారి సి.నారాయణ రెడ్డికి కవిత నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో ఆమెతో పాటుగా రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కూడా పాల్గొన్నారు. మరోవైపు ఈ స్థానంలో సరిపడా బలం లేకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోటీకి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ఎమ్మెల్సీ స్థానంలో నామినేషన్ల దాఖలుకు నవంబర్ 23, మంగళవారమే చివరిరోజు కావడంతో, ఇతరులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకుంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కవిత ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here