ఏపీ ఐటీ మరియు పరిశ్రమలు శాఖ మంత్రిగా నేడు బాధ్యతలు స్వీకరించిన గుడివాడ అమర్‌నాథ్

AP Gudivada Amarnath Take Charges Today as Minister of IT and Industries, Gudivada Amarnath Take Charges Today as Minister of IT and Industries, Minister of IT and Industries, Gudivada Amarnath Minister of IT and Industries, IT and Industries, Gudivada Amarnath, Gudivada Amarnath takes charge as AP Minister of IT and Industries, Minister Gudivada Amarnath, AP Minister Gudivada Amarnath, Andhra Pradesh Minister Gudivada Amarnath, Anakapalli MLA Gudivada Amarnath, new reshuffled Cabinet Ministry of Andhra Pradesh, Andhra Pradesh Cabinet, Cabinet reshuffle, AP Cabinet reshuffle News, AP Cabinet reshuffle Latest News, AP Cabinet reshuffle Latest Updates, AP Cabinet reshuffle Live Updates, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, YS Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రిగా గుడివాడ అమర్‌నాథ్ నేడు బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఉదయం సచివాలయంలోని ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆపై రామాయపట్నం పోర్టుకోసం జరిపిన భూసేకరణలో భాగంగా లబ్దిదారులకు అందించాల్సిన రూ. 8 కోట్ల భూ పరిహారానికి సంబంధించిన ఫైలుపై మంత్రిగా తన మొదటి సంతకం చేశారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో అతి పిన్న వయస్కుడు అమర్‌నాథ్ కావటం గమనార్హం. అయినా మంత్రిగా తొలివిడతలోనే పలు శాఖలను నిర్వహించనున్నారు అమర్‌నాథ్.

అనంతరం మంత్రి అమర్‌నాథ్ మాట్లాడుతూ.. ఈ సారి కేబినెట్‌లో 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారికే కేటాయించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి రికార్డు సృష్టించారని పేర్కొన్నారు. నన్ను నమ్మి ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ ‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పారు. అలాగే మొదట ఎమ్మెల్యేగా తనకు ప్రాతినిథ్యం వహించే అవకాశం కల్పించిన అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటానన్నారు. దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి నిర్వహించిన మంత్రిత్వ శాఖలను సీఎం జగన్ నాకు కేటాయించారని, గౌతమ్ రెడ్డి ఆశయాలని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్దికి తనవంతు బాధ్యతగా చిత్తశుద్ధితో పనిచేస్తానని.. పొరుగు రాష్ట్రాలతో పోటీ పడేలా విశాఖ నగరంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =