వికీలీక్స్ వ్యవస్థాపకుడు ‘జూలియన్ అసాంజే’కు షాక్ ఇచ్చిన యూకే కోర్టు.. అమెరికాకు అప్పగించాలంటూ ఉత్తర్వులు జారీ

UK Court Formally Issues Order To Extradite Wiki Leaks Founder Julian Assange To USA, UK Court Formally Issues Order To Extradite Wiki Leaks Founder, Wiki Leaks Founder Julian Assange To USA, UK Court Formally Issues Order To Extradite Wiki Leaks Founder Julian Assange, Wiki Leaks Founder Julian Assange, Julian Assange, Wiki Leaks Founder, UK court formally issues order to extradite WikiLeaks founder Julian Assange To USA, Julian Assange, UK Court Formally Issues Order To Extradite WikiLeaks founder Julian Assange To USA, UK court issued a formal order to extradite WikiLeaks founder Julian Assange to the United States, WikiLeaks founder News, WikiLeaks founder Latest News, WikiLeaks founder Latest Updates, Mango News, Mango News Telugu,

వికీలీక్స్ వ్యవస్థాపకుడు ‘జూలియన్ అసాంజే’కు యూకే కోర్టు షాక్ ఇచ్చింది. ఇరాక్ మరియు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాలకు సంబంధించిన రహస్య ఫైళ్లను ప్రచురించడంపై విచారణను ఎదుర్కొనేందుకు వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను అమెరికాకు అప్పగించాలని యూకే కోర్టు బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ఇప్పుడు అంతర్గత మంత్రి ప్రీతి పటేల్‌పై ఆధారపడి ఉంది. అయితే అప్పగింతను ఆమోదించడానికి ఏదైనా నిర్ణయం తీసుకున్న 14 రోజుల లోపు అస్సాంజ్ అప్పీల్ చేయవచ్చు. కాగా సెంట్రల్ లండన్‌లోని యూకే కోర్టులలో దీనిపై విచారణ దీర్ఘకాలంగా కొనసాగుతోంది. అయితే గతంలో అతను లేవనెత్తిన ఇతర ముఖ్యమైన సమస్యలకు సంబంధించి ఇంకా హైకోర్టుకు అప్పీల్ చేయలేదు అని అతని న్యాయవాదులు బిర్న్‌బర్గ్ పీర్స్ సొలిసిటర్స్ ఒక ప్రకటనలో తెలిపారు.

అసాంజేను అమెరికాకు అప్పగించే చర్యలకు వ్యతిరేకంగా యూకే సుప్రీం కోర్టులో అప్పీల్ చేయడానికి గత నెలలో అనుమతి నిరాకరించబడింది. దీంతో అమెరికాలో అతను జీవితకాలం జైలు శిక్షను అనుభవించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇరాక్ మరియు ఆఫ్ఘనిస్తాన్‌లలో అమెరికా నేతృత్వంలోని యుద్ధాలకు సంబంధించిన 500,000 రహస్య సైనిక ఫైళ్ల ప్రచురణకు సంబంధించి వాషింగ్టన్ అతనిపై విచారణ చేయాలని కోరుతోంది. కానీ అమెరికా ప్రభుత్వం అప్పీల్ చేసిన మీదట అక్టోబర్‌లో జరిగిన రెండు రోజుల అప్పీల్ విచారణలో ప్రభుత్వ న్యాయవాదులు అసాంజేని ఫెడరల్ సూపర్‌మాక్స్ జైలులో ఒంటరిగా శిక్షించేలా ఉంచరని మరియు తగిన జాగ్రత్తలు తీసుకుంటారని దౌత్యపరమైన హామీలను ఇచ్చారు. దీంతో జూలియన్ అసాంజేను అమెరికాకు అప్పగించాలని యూకే కోర్టు బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే దౌత్యపరమైన ప్రొసీజర్ పూర్తిచేసి అసాంజేను అమెరికాకు తీసుకెళ్లనున్నారు న్యాయవాదులు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 4 =