తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పరిమాణం, బరువుపై ఎలాంటి అపోహలోద్దు: టీటీడీ

TTD Reiterated to Devotees not to Believe Baseless Allegations about Quality and Quantity of Srivari Laddu,TTD on Quality and Quantity of Srivari Laddu, Srivari Laddu, Srivari Laddu Prasadam,Mango News,Mango News Telugu,TTD Latest News And Updates, Tirumala Tirupati Devasthanams,Tirumala Laddu Prasadam,Laddu Prasadam, Tirupati Laddu,Srivari Laddu News And Live Updates, Dollar Seshadri,TTD Chairperson Y. V. Subba Reddy

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పరిమాణం, బరువుపై ఎలాంటి అపోహలోద్దని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. “తిరుమ‌ల శ్రీవారి లడ్డూ ప్రసాదం 160 గ్రాముల నుండి 180 గ్రాములు బరువు కలిగి వుంటుంది. ప్ర‌తి రోజు పోటు కార్మికులు త‌యారు చేసిన ల‌డ్డూ ప్ర‌సాదాల‌ను ఒక ప్ర‌త్యేక‌ ట్రేలో ఉంచి, ప్ర‌తి ట్రే బ‌రువును పోటు అధికారులు త‌నిఖీ చేస్తారు. అనంత‌రం ల‌డ్డూ ప్ర‌సాదాల‌ను కౌంట‌ర్ల‌కు త‌ర‌లించి, భ‌క్తుల‌కు అందిస్తారు. ఇందులో పూర్తి పార‌ద‌ర్శ‌క‌త ఉంటుంది. వేయింగ్ మిషన్‌లో సాంకేతిక‌ సమస్య కారణంగా మైనస్ 70 అని ఉండటం, కాంట్రాక్టు సిబ్బంది అవగాహన లోపం కార‌ణంగా లడ్డూ బరువుపై భ‌క్తులు అపోహల‌కు గుర‌య్యారు. లడ్డూ బరువు కచ్చితంగా 160 నుండి 180 గ్రాములు ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాలుగా అత్యంత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో లడ్డూ ప్రసాదాన్ని పోటు కార్మికులు తయారు చేస్తున్నారు. అదేవిధంగా ల‌డ్డూ బ‌రువు, నాణ్య‌త విష‌యంలో కూడా టీటీడీ ఏనాడు రాజీ ప‌డ‌లేదు” అని టీటీడీ పేర్కొంది.

“సాధార‌ణంగా ల‌డ్డూ కౌంట‌ర్ల వ‌ద్ద ఏదేని ఇబ్బంది త‌లెత్తితే వెంట‌నే అక్క‌డ అందుబాటులో ఉన్న ల‌డ్డూ కౌంట‌ర్ అధికారికి తెలియ‌జేస్తే, అక్క‌డిక్క‌డే స‌మ‌స్యను ప‌రిష్క‌రించే వ్య‌వ‌స్థ టీటీడీలో ఉంది. కానీ స‌దరు భ‌క్తుడు ఇవిఏమి చేయ‌కుండా సోష‌ల్ మీడియాలో టీటీడీపై ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌డం శోచ‌నీయం. కావున భ‌క్తుడు ఆరోపించిన‌ట్లు ల‌డ్డూ పరిమాణం, బరువులో ఎలాంటి వ్య‌త్యాసం లేదు. సామాజిక మాధ్యమాలలో వస్తున్న ఇలాంటి అపోహలను భక్తులు నమ్మవద్దని కోరుతున్నాం” అని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − twelve =