ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం, ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు నిలిపివేత

2021 AP Municipal Elections, Andhra Pradesh Municipal Corporation, Andhra Pradesh Municipal Corporation elections, Andhra Pradesh Municipal elections, Andhra Pradesh Municipal Elections 2021 news and live updates, AP Municipal Elections, AP Municipal Elections 2021, Ap Municipal Elections Campaign, AP Municipal Elections Campaign Ends, AP Municipal Elections Date, AP Municipal Elections News, AP SEC Nimmagadda Ramesh, Mango News, Municipal Elections

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలకు సోమవారం సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగిసింది. ఏపీలో విజయనగరం, మచిలిపట్నం, గుంటూరు, ఒంగోల్, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ మున్సిపల్ కార్పొరేషన్స్ తో పాటుగా గ్రేటర్ విశాఖపట్నం, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లలో మరియు 13 జిల్లాలోని 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు మార్చి 10న పోలింగ్ జరనున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఏలూరు కార్పొరేషన్ కు సంబంధించి ఓటర్ల జాబితా, వార్డుల పునర్విభజన అంశాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు అక్కడ ఎన్నికల నిర్వహణ నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

మున్సిపల్ ఎన్నికల కోసం అధికార వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించారు. ముఖ్యంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, విజయవాడ కార్పొరేషన్లలో అభ్యర్థులు ప్రచారాన్నిహోరెత్తించారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు పెద్దస్థాయిలో విజయం సాధించగా, మున్సిపల్ ఎన్నికల్లో కూడా సంచలన విజయాలను నమోదు చేస్తామని వైఎస్సార్సీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మార్చి 10వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, మార్చి 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =