తెలంగాణలో వ్యవసాయ ఆధారిత అగ్రి-టెక్ స్టార్ట్ అప్ లకు ప్రభుత్వం ప్రోత్సాహం: సీఎస్

Agri-tech Start-ups, Agritech, Agritech Startups, Chief Secretary Somesh Kumar, Mango News, Meeting of Agri-tech Start-ups, Somesh Kumar, Somesh Kumar Presided over Meeting of Agri-tech Start-ups, Telangana CS, Telangana CS Latest News, Telangana CS Meeting, Telangana CS Somesh Kumar

వ్యవసాయరంగంపై ఆరు స్టార్ట్ అప్ కంపెనీలు రూపొందించిన ప్రజెంటేషన్ కు సంబంధించి సోమవారం నాడు బి.ఆర్.కె.ఆర్. భవన్ లో జరిగిన సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దార్శనికతలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో వేగంగా అడుగులు వేసింది. సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాల నుండి 2.11 కోట్ల ఎకరాలకు పెరిగింది. అదే విధంగా ఈ రబీ సీజన్ లో తెలంగాణలో మొత్తం దేశంలోనే అత్యధికంగా 51 లక్షల ఎకరాలలో వరి సాగులో ఉంది. వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో అగ్రి-టెక్ స్టార్ట్ అప్ లు రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. స్టార్ట్ అప్ లకు సంబంధించి ప్రభుత్వం భాగస్వామ్యునిగా, వినియోగదారునిగా, మొదటి కస్టమర్ గా ఉంది.

ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, వ్యవసాయశాఖలో అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకోవాలని, రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని, వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న అవరోధాలకు పూర్తి పరిష్కారాలను సాధించుటకై ప్రత్యేక ప్రతిపాదనలు రూపొందించాలని అగ్రి-టెక్ స్టార్ట్ అప్ కంపెనీలకు సూచించారు. రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత అగ్రి-టెక్ స్టార్ట అప్ లను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ఎకో సిస్టంలో డిజిటల్ పరివర్తనకు అనువైన స్టార్ట్ అప్ లను గుర్తించుటకు, ఆ రంగంలో కృషి చేస్తున్న స్టార్ట్ అప్ లకు మరిన్ని అవకాశాలను ఇవ్వడానికి ప్రభుత్వం చొరవచూపుతున్నట్లు తెలిపారు. స్టార్ట్ అప్ లకు ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సీఎస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఐ.టి.శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్, డాక్టర్ ప్రవీణ్ రావు, పి.జె.టి.ఎస్.ఎ.యు, అగ్రి హబ్, సీఈవో కల్పన శాస్త్రి మరియు అగ్రి స్టార్ట్ అప్ కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + two =