మంత్రి పెద్దిరెడ్డిపై చర్యలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కీలక ఆదేశాలు

Andhra Pradesh Government, Andhra Pradesh panchayat elections, AP Gram Panchayat Elections, AP Gram Panchayat Elections News, AP Local Body Polls, AP Panchayat polls, AP Panchayat polls 2021, AP Panchayat Raj Minister, AP Political Updates, AP SEC Issued Orders to Take Action Against Minister Peddireddy Ramachandra Reddy, AP SEC Nimmagadda Ramesh, AP SEC orders for house arrest of Panchayat Raj Minister, Mango News, Minister Peddireddy Ramachandra Reddy, Panchayat polls, Peddireddy Ramachandra Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా పలు పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఏపీ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. మంత్రి పెద్దిరెడ్డిని పంచాయతీ ఎన్నికలు ముగిసే ఫిబ్రవరి 21 వ తేదీ వరకు ఇంటికే పరిమితం చేయాలని, మీడియాతో మాట్లాడకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్ ‌కు రాష్ట్ర ఎన్నికల ‌కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌ శనివారం నాడు లేఖ రాశారు. మంత్రి పెద్దిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగడంతో పాటుగా, ప్రజలంతా ఎలాంటి భయం లేకుండా ఓటు వేసేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. అలాగే మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వచ్చిన పేపర్ క్లిప్పింగ్స్ ను కూడా డీజీపీకి రాసిన లేఖకు జత చేసినట్లు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 6 =