దేశంలో 20 కోట్లు దాటినా కరోనా పరీక్షల సంఖ్య, 2369 ల్యాబ్స్ లో కరోనా పరీక్షలు

20 Crore Corona Tests Till Today In India, coronavirus india live updates, Coronavirus India News LIVE Updates, COVID-19 pandemic in India, India, India Corona Tests, India Corona Tests Count, India Corona Tests News, India Coronavirus, India Covid-19 Updates, India Crossed the Landmark of 20 Crore Corona Tests, India Crossed the Landmark of 20 Crore Corona Tests Till Today, Mango News

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 11,713 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,08,14,304 కు చేరుకుంది. కరోనాతో మరో 95 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,54,918 కి పెరిగింది. కొత్తగా 14,488 మంది బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 1,05,10,796 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 97.19 శాతం గానూ, మరణాల రేటు 1.43 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 1,48,590 (1.37%) మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్ గడ్, గుజరాత్ రాష్ట్రాలలో కరోనా కేసులు నమోదు ఎక్కువుగా ఉంది. కొత్తగా నమోదైన 11,713 కేసులలో 83.03% శాతం ఈ 6 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి.

దేశంలో 20 కోట్లు దాటిన కరోనా పరీక్షల సంఖ్య:

మరోవైపు కరోనా పరీక్షల సంఖ్యలో భారత్ మరో రికార్డును నమోదు చేసింది. ఫిబ్రవరి 3 నాటికీ దేశవ్యాప్తంగా మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 20 కోట్ల (20,06,72,589) మైలురాయిని దాటింది. గత 24 గంటల్లో 7,40,794 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు. దేశంలో పరీక్షా మౌలిక సదుపాయాలు పెంచడంతో కరోనా పరీక్షల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం 1,214 ప్రభుత్వ, 1,155 ప్రైవేట్ తో కలిపి మొత్తం 2369 ల్యాబ్స్ లో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. దేశంలో కరోనా పాజిటివిటి రేటు కూడా క్రమంగా తగ్గుతోంది, ప్రస్తుతం 5.39% వద్ద ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + nine =