సెప్టెంబర్ 19న ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

Andhra Pradesh HC, AP High Court, AP MPTC ZPTC Election Results, AP MPTC ZPTC Election Results 2021, AP SEC Released Notification To Held Counting of ZPTC, AP SEC Released Notification To Held Counting of ZPTC MPTC ElectionS On September 19th, Counting of ZPTC MPTC Elections, Mango News, Notification To Held Counting of ZPTC MPTC ElectionS, SEC Issues Notification After AP HC Approval, ZPTC and MPTC elections, ZPTC and MPTC Elections Counting, ZPTC And MPTC Votes Counting On 19th September, ZPTC MPTC Counting, ZPTC MPTC polls

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన పరిషత్ ఎన్నికల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించేందుకు సెప్టెంబర్ 16, గురువారం రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 19న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి, లెక్కింపు ముగియగానే ఫలితాలను వెల్లడించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్ని నోటిఫికేషన్ విడుదల చేశారు.

సెప్టెంబర్ 16న తీర్పులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా విస్తృత స్థాయిలో కోవిడ్-19 మార్గదర్శకాలు/ప్రోటోకాల్‌ లను జాగ్రత్తగా అనుసరించాలని నోటిఫికేషన్ పేర్కొన్నారు. అలాగే ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ కౌంటింగ్‌ ఏజెంట్ల వివరాలను సంబంధిత రిటర్నింగ్‌ అధికారులకు అందజేయాలని సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 6 =