వైఎస్ వివేకానంద రెడ్డి కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్

AP Supreme Court Gives Green Signal to Transfer YS Vivekananda Reddy Case For Another State, AP Supreme Court, Green Signal to Transfer YS Vivekananda Reddy Case, YS Vivekananda Reddy Case, Mango News, Mango News Telugu, YS Vivekananda Reddy Case For Another State, YS Vivekananda Reddy Murder Case, YS Vivekananda Reddy Case News, YS Vivekananda Reddy Murder, AP CM YS Jagan Mohan Reddy, YS Vivekananda Reddy Latest News And Updates, AP CM YS Jagan Live Updates, Andhra Pradesh News And Updates

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా వివేకా కుమార్తె సునీతా రెడ్డి వేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిపిన సుప్రీం కోర్టు కేసుని బదిలీ చేసేందుకు అనుమతిచ్చింది. ఏపీలో ఈ కేసు విచారణ సక్రమంగా జరగడం లేదని, సాక్షులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని సునీత తన పిటిషన్ లో పేర్కొన్నారు. స్థానిక ఎంపీ కేసు దర్యాప్తు విషయంలో ప్రభావం చూపిస్తున్నారని, అలాగే దర్యాప్తు అధికారులపై ప్రైవేట్ కేసులు పెడుతున్నారని, కావున దీనిని వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను సుమారు మూడు గంటల పాటు విచారించిన అనంతరం ఈ నిర్ణయానికొచ్చింది.

మరోవైపు ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీబీఐ 200 పేజీల అఫిడవిట్‌ను కోర్టులో దాఖలు చేసింది. ఈ సందర్భంగా కేసుని ఏ రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుకుంటున్నారని ప్రతివాదులైన ఉమాశంకర్ రెడ్డి, గంగిరెడ్డిలను సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. అయితే దీనిపై సీబీఐ స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్రానికి మాత్రం బదిలీ చేయవద్దని, కర్నాటక కు బదిలీ చేయాలని కోర్టును ప్రత్యేకంగా కోర్టుని కోరింది. ఇక సునీతా రెడ్డి తరపు న్యాయవాదులు మాత్రం కేసుని తెలంగాణకు బదిలీ చేసినా తమకు ఫర్వాలేదని విన్నవించారు. ఈ సమయంలో విచారణను ఢిల్లీకి బదిలీ చేయాలనే ప్రస్తావన కూడా రావడం గమనార్హం. కేసు విచారణను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =